Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశవ్యాప్త హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రశంసించిన ప్రధాని


తొమ్మిది నెలల కన్నా తక్కువ వ్యవధిలోనే కోటికి పైగా హెచ్‌పీవీ వ్యాక్సిన్లతో చరిత్రాత్మక మైలురాయిని సాధించిన దేశవ్యాప్త హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ కార్యక్రమం ద్వారా ఏటా అర్హులైన బాలికల్లో దాదాపు 87 శాతం మందికి టీకాలను అందించారు.

ముందస్తు ఆరోగ్య రక్షణ సేవల ద్వారా దేశంలోని ఆడబిడ్డలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించే దిశగా ఈ విజయం ఒక కీలకమైన ముందడుగని శ్రీ మోదీ పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతంగా అమలయ్యేందుకు కృషి చేసిన భాగస్వాములందరి సమష్టి నిబద్ధత, సమన్విత చర్యలకు ఇది నిదర్శనమన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

ముందస్తు ఆరోగ్య సంరక్షణ దిశగా మన ప్రయాణంలో ఇదొక కీలకమైన మైలురాయి.

గర్భాశయ క్యాన్సర్ నుంచి బాలికలను రక్షించి, వారికి ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించే దిశగా ప్రతీ డోస్ ఒక ముందడుగు.

సమష్టి కృషితో ఈ అద్భుత విజయాన్ని సాధ్యమయ్యేలా చేసిన భాగస్వాములందరికీ నా అభినందనలు.  

Prime Minister shares Sanskrit Subhashitam highlighting essential qualities that sustain prosperity