Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశంలో నేపాల్ ప్రధాని ఆధికారిక పర్యటన చోటు చేసుకున్న ప్రధాన పరిణామాలు

భారతదేశంలో నేపాల్ ప్రధాని ఆధికారిక పర్యటన చోటు చేసుకున్న ప్రధాన పరిణామాలు


ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ప్రాజెక్టుల శుభారంభం:
అయోధ్య, జనక్‌పూర్ మధ్య సరయూ-కమలా ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును ప్రారంభించారు.
బన్‌బాసాలో కొత్త ఐసీపీకి శంకుస్థాపన చేశారు. భైరహవా, సునౌలీ, దోధారా చందానీలో ఐసీపీ నిర్మాణ పనులలో పురోగతిని సమీక్షించారు.
భారత్‌లోని ధార్‌చూలా, నేపాల్ లోని దార్చులా మధ్య కొత్తగా సరిహద్దుకు ఆవల మోటార్లు ప్రయాణించడానికి అనువుగా నిర్మించిన వంతెనను ప్రారంభించారు.
లోయర్ అరుణ్ జలవిద్యుత్తు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీని సామర్థ్యం 669 మెగావాట్లు
మోతిహారీ-అమలేఖ్‌గంజ్ ఆయిల్ పైప్‌లైన్ (ఎమ్ఏపీఎల్) ప్రాజెక్టులో రెండో దశను ప్రజలకు అంకితం చేశారు.
ప్రతిపాదిత సిలీగుడీ-ఝాపా పెట్రోలియమ్ పైప్‌లైనులో భాగమైన ఝాపా పెట్రోలియమ్ టర్మినల్‌కు శంకుస్థాపన చేశారు.
ప్రకటనలు:
నేపాల్‌లో పునర్నిర్మాణం, దీర్ఘకాలిక అభివృద్ధికి సాయపడటానికి గాను రూ.15,000 కోట్ల (నేపాలీ రూపాయల్లో అయితే 24,000 కోట్లు)తో అభివృద్ధి సహకార ప్యాకేజీని ప్రకటించారు.
నేపాల్‌కు ట్రాన్జిట్ కార్గో ఇకపై భారతదేశంలో దీన్‌దయాళ్ ఓడరేవు (కాండ్లా, గుజరాత్), పారాదీప్ ఓడరేవు (ఒడిశా)లకు చేరుకోవడానికి అనుమతించారు.
నేపాల్‌లోని చిత్‌వన్‌లో వ్యావసాయిక, పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నారు.
నేపాల్‌లో ఐఐటీ ఆఫ్‌షోర్ క్యాంపసును ఏర్పాటు చేస్తారు.
ప్రతిపాదిత రక్సౌల్-కాఠ్‌మాండూ విద్యుదీకృత బ్రాడ్-గేజ్ రైల్వే లైను నిర్మాణానికి తుది స్థలం సర్వేను ఖరారు చేయనున్నారు.
అవగాహన ఒప్పందాలు (ఎమ్ఓయూస్):
విద్యా, పరిశోధన సహకారానికి గాను భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లో గల జాతీయ ఫోరెన్సిక్ విజ్ఞానశాస్త్రాల విశ్వవిద్యాలయం, నేపాల్ పోలీసుకు చెందిన అపరాధ పరిశోధన విభాగం కలిసి ఓ అవగాహన ఒప్పందాన్ని (ఎమ్ఓయూ) కుదుర్చుకున్నాయి.
భారత్‌కు చెందిన రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం (ఆర్ఆర్‌యూ)కు, నేపాల్‌కు చెందిన జాతీయ పోలీస్ అకాడమి (ఎన్‌పీఏ) కలిసి ఒక ఎమ్ఓయూను కుదుర్చుకున్నాయి.
నేపాల్ సివిల్ సర్వెంట్లకు సామర్థ్యాల పెంపుదలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి భారత ప్రభుత్వ పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగానికి చెందిన జాతీయ సుపరిపాలన కేంద్రం, నేపాల్ ప్రభుత్వ సమాఖ్య వ్యవహారాలు, సాధారణ పరిపాలన మంత్రిత్వ శాఖ ఆధీనంలోని నేపాల్ పరిపాలన సిబ్బంది కళాశాల కలిసి ఒక ఎమ్ఓయూను కుదుర్చుకున్నాయి.
ఆయుర్వేద, ఇతర సాంప్రదాయిక వైద్య వ్యవస్థల రంగంలో సహకారానికి సంబంధించి భారత్, నేపాల్ ప్రభుత్వాల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.
దక్షిణ ఆసియా ఉపగ్రహ వినియోగానికి సంబంధించి ఉపగ్రహ సంచార నెట్‌వర్కు (శాట్‌కామ్)ను ఏర్పాటు చేయడానికి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), నేపాల్ ప్రభుత్వ సమాచార, సంచార మంత్రిత్వ శాఖ (ఎమ్ఓసీ) ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
సుస్థిర పట్టణాభివృద్ధి రంగంలో సాంకేతిక సహకారానికి సంబంధించి భారత్, నేపాల్ ప్రభుత్వాలు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
ఆరోగ్యం, వైద్య రంగంలో సహకారానికి భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నేపాల్ ప్రభుత్వ ఆరోగ్యం, ఆహార భద్రత మంత్రిత్వ శాఖ కలిసి ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
పశుగణం, మత్స్యపరిశ్రమ అభివృద్ధి రంగంలో సహకారానికి సంబంధించి భారత్, నేపాల్ ప్రభుత్వాలు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

***