Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలో ప్రమాదం.. ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి సంతాపం


ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌ జిల్లాలో జరిగిన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

 

మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.

 

ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఒక పోస్టు చేసింది

 

“ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించిందని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

 

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో ఒక్కొక్కరికి పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తాం. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున అందిస్తాం: ప్రధానమంత్రి @narendramodi’’ అని పేర్కొన్నారు.