పిఎంఇండియా
భారత్-బాంగ్లా ప్రొటోకాల్ రూట్ లో జమునా నది తాలూకు సిరాజ్ గంజ్-దైఖావా స్ట్రెచ్ ను, కుశియారా నది తాలూకు అశుగంజ్-జకీగంజ్ స్ట్రెచ్ లలో ఫెయిర్ వే ను అభివృద్ధిపరచడం కోసం అవసరమైన తవ్వకం పనులను రెండు దేశాలు చేపట్టేందుకు గాను భారతదేశం మరియు బాంగ్లాదేశ్ ల మధ్య ఒక అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎమ్ఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ ఎమ్ఒయు ఈశాన్య భారతదేశంలో సరుకు రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించగలుగుతుంది. సిలిగుడీ చికిన్స్ నెక్ కారిడోర్ లో రద్దీని కూడా ఇది తగ్గించగలుగుతుంది.