Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పెట్రోలియమ్, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ అధీనంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికీ పర్చేజ్ ప్రిఫరెన్స్ (లింక్ డ్ విత్ లోకల్ కంటెంట్ (పిపి-ఎల్ సి) ని సమకూర్చే విధానానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం


పెట్రోలియమ్, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ అధీనంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికీ పర్చేజ్ ప్రిఫరెన్స్ (లింక్ డ్ విత్ లోకల్ కంటెంట్ (పిపి-ఎల్ సి) ని సమకూర్చే విధానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్ష‌తన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ విధానం 5 సంవత్సరాల కాలానికి వర్తిస్తుంది. ఈ విధానం అమలును పర్యవేక్ష‌ించడానికి, వార్షిక సమీక్ష‌ను చేపట్టడానికి మరియు ఈ విధానాన్ని సంవత్సరవారీ ప్రాతిపదికన కొనసాగించాలని సిఫారసు చేయడానికి గాను ఒక సారథ సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.

ఈ విధానంలో భాగంగా కొన్ని విధాలైన చమురు మరియు గ్యాస్ వ్యాపార కార్యకలాపాలకు వర్తించేటట్లుగా లోకల్ కంటెంట్ (ఎల్ సి) లక్ష‌్యాలను నిర్దేశించనున్నారు. లోకల్ కంటెంట్ లక్ష‌్యాలను అందుకున్న తయారీదారులు/సేవల సరఫరాదారు సంస్థలు మరియు ఏ సంస్థలైతే అతి తక్కువ చెల్లుబాటు ధరలో 10% లోపు ఉదాహరించిన ధర (quoted price)ను పేర్కొంటాయో ఆయా సంస్థలు- అటువంటి ధరతో సమానమైన కొనుగోలు ఆర్డర్ లోని నిర్దేశిత భాగానికిగాను- పర్చేజ్ ప్రిఫరెన్స్ కు అర్హతను సంపాదిస్తాయి.

సరఫరాదారులు మరియు సేవల సరఫరాదారు సంస్థలు క్రమంగా ‘మేక్ ఇన్ ఇండియా’ విధానాలను అనుసరించేటట్లుగాను, దేశం లోపల వాటి వస్తువులు మరియు సేవలకు విలువను జోడించేందుకు ఈ విధానం ఆయా సంస్థలకు ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఈ విధానం పబ్లిక్ సెక్టర్ ఎంటర్ ప్రైజెస్ అన్నింటికీ వర్తిస్తుంది. అలాగే వాటి పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థలకు, ఒకటి లేదా అంతకు మించిన పబ్లిక్ సెక్టర్ ఎంటర్ ప్రైజెస్ 51 % లేదా అంతకు మించిన ఈక్విటీని కలిగివున్న జాయింట్ వెంచర్ లకు, పెట్రోలియమ్ మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ యొక్క అధీన కార్యాలయాల (subordinate offices)కు, ఇంకా అనుబంధ కార్యాలయాలకు (attached offices)కు వర్తిస్తుంది.

పూర్వ రంగం :

భారతదేశాన్ని ఒక గ్లోబల్ డిజైన్ & మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చడానికి రూపొందించిన విస్తృత‌మైన దేశ నిర్మాణ కార్యక్రమాలలో ఒక భాగంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి 2014 సెప్టెంబర్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అనుగుణంగా భారతదేశంలో చమురు మరియు గ్యాస్ పథకాల అమలుకు సంబంధించినంతవరకు వస్తువులు మరియు సేవలలో స్థానికంగా రూపొందించే భాగాలను విస్తరించిన సంస్థలకు, చమురు మరియు గ్యాస్ వ్యాపార కార్యకలాపాలలో లోకల్ కంటెంట్ లక్ష‌్యాలను అందుకునే తయారీదారులు/సేవల సరఫదారు సంస్థలకు పర్చేజ్ ప్రిఫరెన్స్ ను సమకూర్చే ఒక విధానం ద్వారా ప్రోత్సాహకాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.