పిఎంఇండియా
సెంట్రల్ రోడ్ ఫండ్ చట్టం 2000 ను సవరించి జాతీయ జలమార్గ అభివృద్ధి, నిర్వహణకు కేంద్ర రహదారుల నిధి నుంచి 2.5 శాతం కేటాయిపునకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అథ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు
సంబంధించిన ప్రతిపాదనను నౌకాయాన మంత్రిత్వశాఖ, రహదారి రవాణా,జాతీయరహదారుల మంత్రిత్వశాఖ సంయుక్తంగా ప్రతిపాదించాయి. ఈమేరకు జాతీయ రహదారుల అభివృద్ధికి కేటాయించే వాటాను తగ్గించాలని కోరాయి. జాతీయ జలమార్గాల
ప్రాజెక్టులను అమలు చేసేటపుడు పిపిపి పద్దతిలోచేయడానికి అవకాశం ఉన్నవాటిని పిపిపి పద్ధతిలో చేయనివ్వాలని, ఏదైనా పనికి ప్రైవేటు పెట్టుబడులు రాని చోట మాత్రమే ప్రభుత్వ నిధులు వాడాలని కేబినెట్ సూచించింది.
సెంట్రల్ రోడ్ ఫండ్ (సవరణబిల్లు) 2017ను రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ రాగల 2017 వర్షాకాల పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టనుంది.
ప్రభావం
సెంట్రల్ రోడ్ఫండ్ రాబడిలో 2.5 శాతం మొత్తాన్ని కేటాయించడం ద్వారా అదివసూలు చేస్తున్నసుంకాల ప్రస్తుత రేట్ల ప్రకారం సుమారుగా ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు జాతీయ జలమార్గాల నిర్వహణ అభివృద్ధికి అందుబాటులోకి వస్తాయి.
2022-23 వరకు జాతీయ జల మార్గాలపై ఎంపిక చేసిన ప్రాజెక్టుల అభివృద్ధికి సుమారు 25 వేల కోట్ల రూపాయలు అవసరమౌతాయని ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐడబ్ల్యుఎఐ) అంచనా వేసింది. ఇందుకు సంబంధించి మల్టీ
మోడల్ టెర్మినళ్ల నిర్మాణం, కొత్త నావిగేషన్ లాక్, నదీ సమాచార వ్యవస్థ ఫెయిర్ వే ల అభివృద్ధి తదితరాలను జల మార్గ వికాస్ ప్రాజెక్టు కింద జాతీయ జలమార్గం-1(గంగా నదిపై) ఇప్పటికే అమలు చేస్తున్నారు. రాగల మూడు సంవత్సరాలలో 24
జాతీయ జలమార్గాల అభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళికలు సిద్ధం చేసింది.
రాగల ఐదు సంవత్సరాలలో అంతర్గత జలమార్గ రవాణా రంగం 1.8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఫెయిర్వే, టెర్మినళ్లు,నావిగేషన్‌కు సహాయం, బార్జ్‌లు, శిక్షణ వంటి వాటిలో కొత్త ఉపాధి అవకాశాలూ రానున్నాయి. అంతేకాకుండా
106 అదనపు జాతీయ జలమార్గాల అభివృద్ధి కూడా కొత్త ఉపాధి అవకాశాలను కల్పించనుంది.
నేపథ్యం
జాతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే అంతర్గత జల మార్గ రవాణా రంగాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలంగా స్పష్టం చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఉన్న ఐదు జాతీయ జలమార్గాలు, కొత్తగా 106 జాతీయజలమార్గాఅ
అభివృద్ధి నిర్వహణకు జాతీయ జలమార్గాల చట్టం 2016 ను తీసుకువచ్చారు. ఇది పార్లమెంటు ఆమోదం పొంది అమలులోకి వచ్చింది.
కేబినెట్ ఆమోదించిన ఏర్పాటు ప్రకారం ,జాతీయ జలమార్గాల అభివృద్ధి, నిర్వహణకు నిరంతరాయంగా తగినన్ని నిధులు కేంద్ర రోడ్ఫండ్ వ్యవస్థ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. అంతర్గత జల మార్గ రవాణా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇదొక
ముందడుగు. ఈ రంగం వల్ల రవాణా సమర్థంగా జరగడమే కాకుండా పర్యావరణ హితకరమైనది కూడా. దీనివల్ల ఇప్పటికే రద్దీగా మారిన రోడ్లు, రైలు రవాణాపై ఒత్తిడి తగ్గే అవకాశంఉంది. దీనితో ప్రైవేటు పెట్టుబడులు ఈ రంగంలోకి వచ్చే అవకాశం ఉంది.
ఇందుకు ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి. 2000 డిడబ్ల్యుటి రవాణా నౌక సుమారు 125 ట్రక్కులు లేదంటే దాదాపుగా ఒక రైలు ( 40 వాగన్ల రైలు) రవాణా చేయగలిగినంత సరకును రవాణా చేయగలుగుతుంది.