Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నిరంతర ప్రయత్నాలే విజయానికి కీలకం… ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


‘‘నానాశ్రాన్తాయ శ్రీరస్తీతి రోహిత శుశ్రుమపాపో నృషద్వరో జన ఇంద్ర ఇచ్చరతః సఖా చరైవేతి’’ అన్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

నిరంతర ప్రయత్నమే విజయానికి కీలకమనీజీవితంలో ధైర్యందృఢ సంకల్పంఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే వ్యక్తే తన లక్ష్యాన్ని సాధించగలుగుతారనీ ఈ సుభాషితం స్పష్టం చేస్తోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

నిరంతర ప్రయత్నాలే విజయానికి తారక మంత్రం. ధైర్యందృఢ సంకల్పంఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే వ్యక్తులే లక్ష్యాన్ని సాధిస్తారు.

నానాశ్రాన్తాయ శ్రీరస్తీతి రోహిత శుశ్రుమ, పాపో నృషద్వరో జన ఇంద్ర ఇచ్చరతః సఖా చరైవేతి

 

***