పిఎంఇండియా
ఉత్కళ్ ఎక్స్ ప్రెస్ రైలు ఉత్తర ప్రదేశ్ లోని ముజఫ్ఫర్ నగర్ లో పట్టాలు తప్పిన ఘటన పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సునిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు, రైల్వేల మంత్రిత్వ శాఖ మరియు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలుగా అవసరమైన సహాయాన్ని అందించడానికి శాయశక్తులా సకల ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు.
“ఉత్కళ్ ఎక్స్ ప్రెస్ రైలు ముజఫ్ఫర్ నగర్‌లో పట్టాలు తప్పడం నాకు తీవ్ర వేదనను కలిగించింది. మృతుల కుటుంబ సభ్యుల శోకంలో నేను కూడా పాలుపంచుకొంటున్నాను.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. అక్కడి పరిస్థితిని రైల్వేల మంత్రిత్వ శాఖ ఎంతో శ్రద్ధతో పర్యవేక్షిస్తోంది.
రైలు పట్టాలు తప్పిన ఘటన నేపథ్యంలో అవసరమైన అన్ని విధాల సహాయాన్ని అందించడానికి రైల్వేల మంత్రిత్వ శాఖతో పాటు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా శాయశక్తుల సకల ప్రయత్నాలు చేస్తోంది’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Extremely pained by the derailment of the Utkal Express in Muzaffarnagar. My thoughts are with the families of the deceased: PM
— PMO India (@PMOIndia) August 19, 2017
I wish those injured a speedy recovery. The situation is being monitored very closely by the Railways Ministry: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 19, 2017
Railways Ministry & UP Government are doing everything possible & providing all assistance required in the wake of the train derailment: PM
— PMO India (@PMOIndia) August 19, 2017