Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘ‌ట‌న‌ల‌పై ప్ర‌ధాన‌మంత్రి ఖండ‌న‌


దేశంలోని అనేక ప్రాంతాల్లో చెల‌రేగిన హింసాత్మ‌క సంఘ‌ట‌న‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర‌స్థాయిలో ఖండించారు.

‘‘ఇవాళ చోటుచేసుకున్న హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు చాలా బాధ క‌లిగించాయి. ఈ హింస‌ను నేను తీవ్రంగా ఖండిస్తూ- శాంతి నెల‌కొనేందుకు స‌హ‌క‌రించాల‌ని ప్ర‌తి ఒక్క‌రినీ కోరుతున్నాను. శాంతిభ‌ద్ర‌త‌ల‌ను చాలా శ్ర‌ద్ధ‌గా ప‌ర్య‌వేక్షిస్తున్నాం. ఈ మేర‌కు జాతీయ భ‌ద్ర‌త స‌ల‌హాదారు, హోంశాఖ కార్య‌ద‌ర్శుల‌తోనూ నేను అన్ని ప‌రిస్థితుల‌నూ స‌మీక్షించాను. సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొల్పేందుకు అహ‌ర్నిశ‌లూ కృషి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించాను. ఈ దిశ‌గా అవ‌స‌ర‌మైన స‌హ‌య, స‌హ‌కారాలను అందించాల‌ని కూడా చెప్పాను’’ అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.