Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘స్వ‌చ్ఛ‌తా హీ సేవ’ లో పాలు పంచుకొన్న ప్ర‌ముఖ వ్య‌క్తుల‌ను మ‌రియు బృందాల‌ను ప్ర‌శంసించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘‘స్వచ్ఛ‌తా హీ సేవ’’ దిశ‌గా కృషి చేసిన ప్ర‌ముఖ వ్య‌క్తుల‌ను మ‌రియు బృందాల‌ను ప్ర‌శంసించారు. జాతీయ స్థాయి ప‌రిశుభ్ర‌త కార్య‌క్ర‌మం అయిన‌టువంటి ‘‘స్వ‌చ్ఛ‌తా హీ సేవ’’ సెప్టెంబ‌ర్ 15వ తేదీన మొద‌లై, స్వ‌చ్ఛ భార‌త్ దివ‌స్ గా జరుపుకొంటున్న గాంధీ జ‌యంతి రోజైన అక్టోబ‌ర్ 2వ తేదీన ముగిసింది.

ప్ర‌ధాన మంత్రి త‌న ట్విట‌ర్ ఖాతాలో వ‌రుస‌గా రాసిన వాక్యాల‌లో శ్రీ‌యుతులు అనుమ‌ప్ ఖేర్‌, మోహ‌న్‌లాల్‌, స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్‌, రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్‌, అక్ష‌య్ కుమార్‌, శ్రీ‌ శ్రీ ర‌వి శంక‌ర్‌, శ్రీ‌మ‌తి చందా కొచ‌ర్‌, ఇండియా టుడే గ్రూపు, ఇండియా టివి న్యూస్‌, డెటాల్ ఇండియా, ఎన్‌డిటివి, రిల‌య‌న్స్ ఫౌండేష‌న్‌, టాటా ట్ర‌స్టు ల‌తో పాటు భార‌త క్రికెట్ జ‌ట్టు ల‌ను స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ దిశ‌గా అందించిన తోడ్పాటు విషయంలో అభినందించారు.

‘‘ అనుప‌మ్ గారూ, మీ కృషి అభినంద‌నీయం.

ప్ర‌ముఖ న‌టుడు శ్రీ మోహ‌న్‌లాల్ ఉత్తమమైనటువంటి ప్ర‌య‌త్నాన్ని చేశారు.

Important message by @CKforCleanIndia, who along with the @ICICIBank family has made vital contributions to Swachh Bharat Mission.

I laud the @IndiaToday family for the proactive steps to further awareness on Swachhata. Congrats to all #Safaigiri awardees.

Wonderful initiative by @indiatvnews. ఇది దేశవ్యాప్తంగా పరిశుభ్రత సందేశాన్ని మరింతగా వ్యాపింపచేయగలుగుతుంది.

I congratulate @SadhguruJV & the team of Isha Foundation for their exemplary effort to generate awareness on keeping our rivers clean.

భార‌త‌దేశాన్ని ప‌రిశుభ్రంగా రూపొందించ‌డంలో భార‌త‌దేశ క్రికెట్ జ‌ట్టు ప్ర‌శంస‌నీయ‌మైన సందేశాన్ని అందించింది.

రాజీవ్ గారూ, మీది మంచి ప్ర‌య‌త్నమండీ.

I laud @DettolIndia & @ndtv for the initiative. This timeline has many inspiring efforts on cleanliness. https://twitter.com/swachhindia.

Laudable work by @ril_foundation across India towards a Swachh Bharat. Have a look at this timeline. https://twitter.com/ril_foundation/

Congrats @tatatrusts! ఎస్ బిఎమ్ కు మద్దతివ్వడం కోసం ప్రతి జిల్లాలో ఓ యువ వృత్తి నిపుణునికి ప్రేరక్ కార్యక్రమాన్ని అందిస్తుండటం ప్రశంసార్హంగా ఉంది.

Well written @akshaykumar. స్వచ్ఛ భారత్ అభియాన్ కు మీరందిస్తున్నటువంటి దృఢమైన మద్దతును ప్రశంసిస్తున్నాను.

మీరు మరియు మీ యొక్క ఆర్ట్ ఆఫ్ లివింగ్ పరివారం శ్రేష్ఠమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు! 125 కోట్ల మంది భారతీయులు కలసి ఒక పరిశుభ్ర భారతదేశాన్ని ఆవిష్కరించనున్నారు ’’ అంటూ ప్ర‌ధాన మంత్రి ట్విట‌ర్ లో రాశారు.

***