భారతీయ సెక్యూరిటీస్ & ఎక్సేంజ్ బోర్డు (సెబీ) మరియు కువైట్ కు చెందిన కాపిటల్ మర్కెట్స్ అధారిటీ (సి.ఎమ్.ఏ) ల మధ్య పరస్పర సహకారం మరియు సాంకేతిక సహాయం కోసం ఒక అవగాహనా ఒప్పందం పై సంతకం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ఈ రెండు సంస్థల మధ్య ఆర్ధిక సంబంధాలు, సహకారం మరింత అభివృద్ధి చెందడానికి ఈ అవగాహనా ఒప్పందం దోహదపడుతుంది. రెండు దేశాలలో సెక్యూరిటీల మార్కెట్లు సమర్ధంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన పరిస్థితులను కల్పించాలనే లక్ష్యంతో ఈ ఒప్పందాన్ని రూపొందించడం జరిగింది.
రెండు దేశాల మధ్య సమాచారం ఇచ్చి పుచ్చుకునే వ్యవస్థను పటిష్ట పరచుకునే దిశగా ఈ ఒప్పందం సహకరిస్తుంది. సెబీ మరియు కువైట్ కు చెందిన స్.ఎమ్.ఏ. సంస్థల అంతర్జాతీయ పరస్పర సహకారం తో పాటు రెగ్యులేషన్ కార్యకలాపాల విలువను ఈ ఒప్పందం మరింత ఇనుమడింపజేస్తుందని భావిస్తున్నారు.
******