Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్-సేషెల్స్ దేశాల మధ్య బ్లూ ఎకానమీ రంగంలో పరస్పర సహకారం కోసం ఫ్రేమ్‌వర్క్ కోసం ప్రొటోకాల్ తయారీ


ఆగస్టు 26, 2015న సేషెల్స్ అధ్యక్షుడు భారత పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై.. రెండు దేశాల మధ్య బ్లూ ఎకానమీ (10ఏళ్లలో వివిధ కార్యక్రమాల ద్వారా 10కోట్ల మందికి ఉపాధి కల్పించటం) విషయంలో పరస్పర సహకారంపై చేసుకున్న ఒప్పందాలకు ప్రధాన మంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సముద్రాలపై అధ్యయనం, సముద్ర వనరుల వినియోగం, కొత్త వనరులను శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో వెలికితీయటం ద్వారా రెండు దేశాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేందుకు విధివిధానాల రూపకల్పనకు ఈ ప్రొటోకాల్ సూచిస్తుంది.సేషెల్స్ దేశంతో కుదుర్చుకున్న ఈ సహకార ఒప్పందం వల్ల భారత దేశానికి బ్లూ ఎకానమీ, మానవ వనరుల ఎగుమతి వల్ల లాభాలు, సముద్ర ఆధారిత వనరుల విషచంలో నైపుణ్యత, సాంకేతికతను మరింత పెంచుకునేందుకు మంచి అవకాశం ఉంటుంది. సముద్ర ఆధారిత వనరులపై మరింత అధ్యయనం చేయటం కోసం కొత్త సంస్థల ఏర్పాటు, సాంకేతికతను సేషెల్స్ దేశంతో మార్పిడి చేసుకునేందుకు, భారత శాస్త్రవేత్తలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు వీలుంటుంది. దీంతో పాటు దేశీయంగా మరింత వినూత్నంగా సముద్ర పరిశోధనలకు చేసేందుకు ఈ ఒప్పందం మరింత సహకారం అందించనుంది.