Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హెచ్‌హెచ్‌ ప్ర‌ముఖ్ స్వామి మ‌హారాజ్ జ‌యంతి సంద‌ర్భంగా స్మృత్యంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాన మంత్రి


హెచ్‌హెచ్‌ ప్ర‌ముఖ్ స్వామి మ‌హారాజ్ జ‌యంతి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌కు స్మృత్యంజ‌లి ఘ‌టించారు.

“హెచ్‌హెచ్‌ ప్ర‌ముఖ్ స్వామి మ‌హారాజ్ జ‌యంతి నాడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ల‌క్ష‌లాది భ‌క్తుల‌తో పాటు నేను కూడా ఆయ‌న‌కు ప్ర‌ణ‌మిల్లుతున్నాను. ఆయ‌న ఒక అసాధార‌ణ‌మైన మ‌నీషి; ఆయ‌న చేసిన మార్గ‌ద‌ర్శ‌క సేవ మ‌రియు క‌రుణామ‌య కృషి అసంఖ్యాక జీవితాల‌ పైన స‌కారాత్మ‌క ప్ర‌భావాన్ని ప్ర‌స‌రించింది.

హెచ్‌హెచ్‌ ప్ర‌ముఖ్ స్వామి మ‌హారాజ్ ఉన్న‌త‌మైన ఆలోచ‌న‌లు అన్ని అవ‌రోధాల‌కు అతీతంగా ప్ర‌జ‌ల‌కు దారిని చూపిస్తూ వ‌స్తున్నాయి. ఆర్తుల, పేద‌ల మ‌రియు అణ‌గారిన వ‌ర్గాల వారి జీవితాల‌లో ప‌రివ‌ర్త‌నను తీసుకు రావ‌డానికి ఆయ‌న అందించిన దార్శ‌నిక‌త తో మేము ఎల్ల‌వేళలా ప్రేరణను పొందుతున్నాం.

హెచ్‌హెచ్‌ ప్ర‌ముఖ్ స్వామి మ‌హారాజ్ తో నాకు ఉన్న సంబంధం ప్ర‌త్యేక‌మైంది. ఆయ‌న‌తో గ‌డిపిన కాలం నాకు ఎంతో స్మ‌ర‌ణీయ‌మైన‌టువంటిది. ఆయ‌న ఆశీర్వాదాలు పొంద‌డం నాకు లభించిన అదృష్టం అనుకొంటాను. గ‌త సంవ‌త్స‌రం సారంగ్‌పుర్ లో ఆయ‌నను గురించి నేను చెప్పిన మాటలను https://www.youtube.com/watch?v=azaYIrMsx5g లో ఆలకించ‌వ‌చ్చు” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.