Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బిఎస్ఎఫ్ స్థాప‌క దినం నాడు బిఎస్ఎఫ్ సిబ్బందికి అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌రిహ‌ద్దు భ‌ద్ర‌త ద‌ళం (బిఎస్ఎఫ్‌) స్థాప‌క దినం సంద‌ర్భంగా బిఎస్ఎఫ్ సిబ్బందికి మ‌రియు వారి కుటుంబాల‌కు అభినందనలు తెలిపారు.

“బిఎస్ఎఫ్ స్థాప‌క దినాన్ని పుర‌స్కరించుకొని బిఎస్ఎఫ్ సిబ్బందికి మ‌రియు వారి కుటుంబాల‌కు ఇవే నా అభినంద‌న‌లు. బిఎస్ఎఫ్ ధీరోదాత్తతకు మరియు మ‌న దేశ ప్ర‌జ‌ల‌కు త‌ప్పుప‌ట్ట వీలు లేని సేవలను అందించడానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. ప్ర‌తికూల‌తల బారి నుండి.. అది స‌రిహ‌ద్దుల‌లో గాని, లేదా ప్ర‌కృతి విప‌త్తులు వాటిల్లిన‌ వేళలలో గాని, లేదా ప్ర‌మాదాలు సంభ‌వించిన‌ప్పుడు గాని మనను వారు రక్షిస్తున్నారు. బిఎస్ఎఫ్ ను చూసి మ‌నం గ‌ర్వ‌ిస్తున్నాం” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.