Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌గ‌తి స‌మీక్ష‌

ప్ర‌ధాన‌మంత్రి    ప్ర‌గ‌తి  స‌మీక్ష‌

ప్ర‌ధాన‌మంత్రి    ప్ర‌గ‌తి  స‌మీక్ష‌


క్రియాశీల పాల‌న‌, స‌కాల‌ ఆచ‌ర‌ణ‌ల‌కు ఉద్దేశించిన స‌మాచార సాంకేతిక బ‌హువిధ వేదిక -ప్ర‌గ‌తి- ద్వారా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఏడోసారి వివిధ శాఖ‌లు, అభివృద్ధి ప‌నులను బుధ‌వారం స‌మీక్షించారు. ఇందులో భాగంగా ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి జ‌న్‌ధ‌న్ యోజ‌న ప‌థ‌కానికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై దృష్టిసారించారు. త‌క్ష‌ణ‌మే ఈ ప‌థ‌కంపై అవ‌గాహ‌న ప్ర‌చారం మొద‌లెట్టాల‌ని, ముఖ్యంగా మొబైల్ ఫోన్ల ద్వారా ప్ర‌చారం జ‌ర‌గాల‌ని, ఈ జ‌న్‌ధ‌న్ యోజ‌న ఖాతాల ద్వారా జ‌రిగే మేలును ప్ర‌జ‌ల‌కు అర్థం చేయించాల‌ని ఆయ‌న సూచించారు.

రైల్వేల్లో- ముఖ్యంగా పారిశుద్ధ్యానికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న స‌మీక్షించారు. రైల్వే స్టేష‌న్ల‌తోపాటు రైళ్ళ‌లో పారిశుద్ధ్యం, శుభ్ర‌త కోసం చేప‌డుతున్న చ‌ర్య‌ల‌ను అధికారులు ప్ర‌ధానికి వివ‌రించారు.

భార‌త్‌-బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దులో కంచె నిర్మాణ ప‌నుల‌ను కూడా ఈ సంద‌ర్భంగా ఆయ‌న అడిగి తెలుసుకున్నారు. దేశ భ‌ద్ర‌త విష‌యంలో రాజీ ప‌డే స‌మ‌స్యే లేద‌ని స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాని- సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ కంచె ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని బంగ్లాదేశ్‌తో స‌రిహ‌ద్దును పంచుకుంటున్న ఐదు రాష్ట్రాల ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌ను కోరారు.
జ‌మ్మూకాశ్మీర్‌, అస్సాం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిశా, జార్ఖండ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ , గోవా రాష్ట్రాల్లో కొన‌సాగుతున్న ర‌హ‌దారులు, రైల్వే, విద్యుత్‌, బొగ్గు, విమాన‌యాన‌రంగ మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల ప‌నుల‌ పురోగ‌తిపై అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. భూటాన్‌లోని మూడు హైడ్రో ప‌వ‌ర్ ప్రాజెక్టుల పురోగ‌తిపైనా అధికారులు ప్ర‌ధానికి వివ‌రించారు.

ఆధార్ కార్డు న‌మోదు పురోగ‌తిపైనా ప్ర‌ధాని స‌మీక్షించారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు జ‌న్‌ధ‌న్ ఖాతాలు, ఆధార్ కార్డుల ద్వారా ప్ర‌యోజ‌నాలు అందించేలా ప‌నిచేయాల‌ని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌ను ప్ర‌ధాని కోరారు. త‌ద్వారా లోపాలు త‌గ్గి, ప్రజ‌ల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌న్నారు.