పిఎంఇండియా
భారత్ – కువైట్ ల మధ్య ద్వంద్వ పన్ను విధానం నివారణకు, ఆదాయపు పన్నులకు సంబంధించి ఎగవేతల నిరోధానికి కుదిరిన ఒప్పందం ప్రాథమిక పత్రంలో (ప్రొటోకాల్) సవరణలు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈరోజు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ ఒప్పంద ప్రాథమిక పత్రం (ప్రొటోకాల్) పన్ను విషయాలకు సంబంధించిన సమాచారాన్ని సమర్థంగా ఇచ్చిపుచ్చుకోవడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రూపొందింది. బ్యాంకులకు సంబంధించిన సమాచారం, దేశీయ పన్నువడ్డీ లంకె లేని సమాచారం వంటివన్నీ దీని పరిధిలోకి వస్తాయి. భారత్ లో నివాసమున్న వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని కువైట్ నుంచి అందుకొని దానిని ఇతర లా ఎన్ ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ ప్రోటోకాల్ వల్ల ఇరు పక్షాలకు వీలు ఏర్పడుతుంది. అలాగే అవతలి పక్షం నుంచి కూడా ఇటువంటి సమాచారాన్నే పొందవచ్చు.