పిఎంఇండియా
ఆసియా క్రీడల్లో మహిళల వ్యక్తిగత గోల్ఫ్‌లో భారత్‌కు తొలిసారిగా స్వర్ణ పతకం సాధించిన ప్రణవి శరత్ ఉర్స్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ప్రణవి అద్భుత విజయంతో దేశానికి చిరస్మరణీయమైన క్రీడా ఘట్టాన్ని అందించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ విజయం మరింతమంది యువ భారతీయులను గోల్ఫ్ క్రీడ వైపు ఆకర్షించడంతో పాటు, అత్యున్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగేందుకు వారిని ప్రేరేపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రణవి శరత్ ఉర్స్‌కు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
“చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విజయం! ఆసియా క్రీడల్లో మహిళల వ్యక్తిగత గోల్ఫ్‌లో భారత్‌కు తొలిసారిగా స్వర్ణ పతకం సాధించిన ప్రణవి శరత్ ఉర్స్‌కు అభినందనలు. ఆమె అద్భుత ముగింపు దేశానికి చిరస్మరణీయమైన క్రీడా ఘట్టాన్ని అందించింది. ఈ విజయం మరింతమంది యువ భారతీయులను గోల్ఫ్ క్రీడ వైపు ఆకర్షించడంతో పాటు, అత్యున్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగేందుకు వారిని ప్రేరేపించాలని ఆకాంక్షిస్తున్నాను. అద్భుతంగా ఆడారు. ప్రణవి శరత్ ఉర్స్‌కు శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొంది.
One for the history books!
— PMO India (@PMOIndia) October 3, 2026
Congratulations to Pranavi Sharath Urs on winning India’s first-ever Gold in Women’s Individual Golf at the Asian Games. Her superb finish has given the nation a sporting moment to remember. May this victory draw more young Indians to the game and…