Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉమ్మడి తపాలా బిళ్ళ విడుదలపై ఇండియా, వియత్నాం మధ్య అవగాహన ఒప్పందం


 

భారత తపాలా శాఖ, వియత్నాం పోస్ట్ ఉమ్మడిగా తపాలా బిళ్ళ జారీ చేయడాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తెలియజేసారు.
కేంద్ర కమ్యునికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ మరియు వియత్నాం పోస్ట్ ఉమ్మడి తపాలా బిళ్ళను విడుదల చేయడంపై పరస్పరం అంగీకారానికి వచ్చాయి. ఉమ్మడి తపాలా బిళ్ళ విడుదల ఇతివృత్తం : “పురాతన వాస్తుశాస్త్రం” . ఉమ్మడి తపాలా బిళ్ళలను ఈ ఏడాది జనవరి 25న విడుదల చేయడం జరిగింది.
ఇండియా – వియత్నాం ఉమ్మడిగా విడుదల చేసిన తపాలా బిళ్ళలపై భారత్ లోని సాంఛి స్థూపం , వియత్నాంకు చెందిన పో మిన్ పగోడా చిత్రాలు ఉన్నాయి. ఉమ్మడి జారీకి సంబంధించి రెండు దేశాలకు చెందిన తపాలా పాలనా యంత్రాంగాల మధ్య గత డిసెంబర్ 18న అవగాహన ఒప్పందం కుదిరింది.