Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ధాన‌మంత్రిః మోహ‌న్‌పురా నీటిపారుద‌ల ప్రాజెక్టు జాతికి అంకితం

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ధాన‌మంత్రిః మోహ‌న్‌పురా నీటిపారుద‌ల ప్రాజెక్టు జాతికి అంకితం

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ధాన‌మంత్రిః మోహ‌న్‌పురా నీటిపారుద‌ల ప్రాజెక్టు జాతికి అంకితం

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ధాన‌మంత్రిః మోహ‌న్‌పురా నీటిపారుద‌ల ప్రాజెక్టు జాతికి అంకితం


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు మోహ‌న్‌పురా ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు రాజ్‌ఘ‌ర్ జిల్లాలోని భూముల‌కు నీటిపారుద‌ల సౌక‌ర్యం క‌ల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలోని గ్రామాల‌కు తాగునీటిని కూడా స‌ర‌ఫ‌రా చేస్తుంది. ప్ర‌ధాన‌మంత్రి వివిధ మంచినీటి ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేశారు.
మోహ‌న్‌పునాలో పెద్ద‌సంఖ్య‌లో హాజ‌రైన ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, డాక్ట‌ర్ శ్యామ‌ప్ర‌సాద్ ముఖర్జీ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఘ‌న నివాళుల‌ర్పించారు. దేశం త‌న స్వీయ శ‌క్తి, కృషితోనే భ‌ద్రంగా ఉంటుంద‌ని డాక్ట‌ర్ శ్యామ‌ప్ర‌సాద్ ముఖర్జీ సందేశాన్ని ప్ర‌ధాని గుర్తు చేశారు.దేశ పారి్శ్రామి విధానం, విద్య‌, మ‌హిళాసాధికార‌త త‌దిత‌ర రంగాల‌లో డాక్ట‌ర్ శ్యామ‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ సేవ‌ల‌ను ఆయ‌న కొనియాడారు. విద్య‌, ఆరోగ్యం, భ‌ద్ర‌త‌కు డాక్ట‌ర్ శ్యామ ప్ర‌సాద్ ముఖర్జీ అధిక ప్రాధాన్య‌త‌నిచ్చార‌ని ప్ర‌ధాన‌మంత్రి గుర్తుచేశారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన స్కిల్ ఇండియా మిష‌న్‌, స్టార్ట‌ప్ ఇండియా, ముద్రా యోజ‌న , మేక్ ఇన్ ఇండియా వంటి వ‌న్నీ డాక్ట‌ర్ శ్యామ‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ దార్శ‌నిక‌త‌కు అనుగుణ‌మైన‌వేన‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.
కేంద్ర‌ప్ర‌భుత్వం గుర్తించిన ఆకాంక్షిత జిల్లాల జాబితాలో రాజ్‌ఘ‌ర్ జిల్లా ఉన్న‌ద‌ని , ఇక ఇప్పుడు అబివృద్ధిప‌నులు ఇక్క‌డ‌ వేగం పుంజుకుంటాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. దేశ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని , దేశ సామ‌ర్ధ్యాల‌పై వివ్వాసం ఉంచి  భార‌త‌దేశాన్ని 21 వ శ‌తాబ్దిలో ఉన్న‌త‌స్థాయికి తీసుకు వెళ్లేందుకు  కేంద్ర ప్ర‌భుత్వం కృషి చేస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. వ్య‌వ‌సాయ‌రంగంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకున్నఅభివృద్ధి  చ‌ర్య‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి అభినందించారు. రాష్ట్రంలో సాగు భూమిని పెంచినందుకు రాష్ట్ర‌ప్ర‌భుత్వాన్ని ఆయ‌న అభినందించారు. రాష్ట్ర నీటిపారుద‌ల ప్రాజెక్టుల ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చేందుకు రాష్ట్ర‌ప్ర‌భుత్వంతో క‌లిసి కేంద్ర ప్ర‌భుత్వం భుజం భుజం క‌లిపి ముందుకు సాగుతుంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి కృషి సించాయి యోజ‌న ప‌థ‌కం కింద రాష్ట్రంలో 14 ప్రాజెక్టులు అమ‌లు చేస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.  సూక్ష్మ నీటిపారుద‌ల రంగానికి కూడా ప్రాధాన్య‌త నివ్వ‌నున్న‌ట్టు ప్ర‌ధాని చెప్పారు.
వ్య‌వ‌సాయ‌రంగానికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం భూసార ప‌రీక్షా కార్డులు, ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌, ఈ-నామ్ వంటి చొర‌వ‌లు చేప‌ట్టిన విష‌యాన్ని ప్ర‌ధాని ప్ర‌స్తావించారు. ఉజ్వ‌ల యోజ‌న‌, ముద్ర యోజ‌న ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాల గురించి కూడా ప్ర‌ధాన‌మంత్రి వివ‌రించారు.