Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ సేవలపై లోక్ సభ లో ప్రధాని ప్రకటన ముఖ్యాంశాలు

భారత రాజ్యాంగం దేశప్రజల గౌరవానికి, భారత ఐక్యతకు హామీ ఇచ్చిందని ప్రధాని శ్రీ నరేంద్రమోదీ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటైన లోక్ సభ ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

భార‌త్ వంటి భిన్న‌త్వానికి ఆల‌వాల‌మైన దేశంలో రాజ్యాంగ సూత్రాల‌ను మ‌నం చురుగ్గా ప్ర‌జ‌ల‌కు చేర్చాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ప్ర‌ధాని అన్నారు. న‌వంబ‌ర్ 26ని రాజ్యాంగ దినోత్స‌వంగా పాటించుకోవ‌డం వెనుక ప్ర‌ధానోద్దేశం కూడా అదేన‌ని ఆయ‌న తెలిపారు. ఇలాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకోవ‌డం వ‌ల్ల రాజ్యాంగ స్ఫూర్తి క్ర‌మంగా ప్ర‌జ‌ల‌కు చేరుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

రాజ్యాంగ రూప‌క‌ర్త‌ల కృషిని ప్ర‌శంసించేందుకు మాట‌లు చాల‌వ‌ని ప్ర‌ధాని అన్నారు. రాజ్యాంగానికి డాక్ట‌ర్ అంబేద్క‌ర్ అందించిన సేవ‌లు ఎవ‌రూ కాద‌న‌లేనివ‌ని ఆయ‌న చెప్పారు. డాక్ట‌ర్ అంబేద్క‌ర్ ఆలోచ‌న‌లు, బోధ‌న‌లు విలువైన‌వి, వాస్త‌విక‌మైన‌వే కాకుండా అన్ని త‌రాల‌కు వ‌ర్తించేవ‌ని ప్ర‌ధాని కొనియాడారు.

ఏకాభిప్రాయం, అంగీకారం ద్వారానే ప్ర‌జాస్వామ్యం శ‌క్తివంతం అవుతుంద‌ని ప్ర‌ధాని ఉద్ఘాటించారు. పౌరులు త‌మ హ‌క్కులు, విధులు రెండింటికీ స‌మ‌ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ప్ర‌ధాని పిలుపు ఇచ్చారు. త‌న దృష్టిలో భార‌త‌దేశం మౌలిక సిద్ధాంతం “స‌త్య‌మేవ జ‌య‌తే”, “స‌ర్వ పంత్ స‌మ‌భావ్” అని ఆయ‌న అన్నారు.