Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆఫ్గ‌నిస్థాన్‌లో భార‌త ప్ర‌దాని న‌రేంద్ర మోదీ ప్ర‌సంగపాఠం

ఆఫ్గ‌నిస్థాన్‌లో భార‌త ప్ర‌దాని న‌రేంద్ర మోదీ ప్ర‌సంగపాఠం

ఆఫ్గ‌నిస్థాన్‌లో భార‌త ప్ర‌దాని న‌రేంద్ర మోదీ ప్ర‌సంగపాఠం

ఆఫ్గ‌నిస్థాన్‌లో భార‌త ప్ర‌దాని న‌రేంద్ర మోదీ ప్ర‌సంగపాఠం

ఆఫ్గ‌నిస్థాన్‌లో భార‌త ప్ర‌దాని న‌రేంద్ర మోదీ ప్ర‌సంగపాఠం


గౌర‌వ‌నీయులైన ఆఫ్ఘ‌నిస్తాన్ అధ్య క్షుడు ఘ‌ని, చీప్ ఎగ్జిక్యూటివ్ డాక్ట‌ర్ అబ్దుల్లా, స్పీక‌ర్ , ఛెష్‌రాన్ జిర్గా, ఉభ‌య స‌భ‌ల స‌భ్యులారా

గొంతు పెంచొద్దు..ప‌దాల గాంభీర్యాన్ని పెంచండి,.. వ‌ర్ష‌పు జ‌ల్లు వ‌ల్లే పూలు పూస్తాయి.. పిడుగుల వ‌ల్ల కాదు అని ఎనిమిది శ‌తాబ్దాల క్రితం ఆఫ్గ‌నిస్థాన్‌లోని బ‌ల్కా ప్రాంతానికి చెందిన ప్ర‌ముఖ క‌వి జ‌లాలుద్దీన్ రూమీ త‌న క‌విత‌లో పేర్కొన్నారు. అంత‌టి మ‌హ‌నీయుడికి చెందిన ఈ ప్రాంతం గొప్ప దేశం.ఉత్త‌మ విద్వ‌త్తు క‌లిగిన దేశం ఆప్ఘ‌నిస్థాన్‌.

ప‌ద్య‌కావ్యం, గౌర‌వం, దైర్య‌సాహ‌సాలు, ఉదార‌త్వం, సోద‌ర స్నేహానికి, స్వాతంత్ర్య త‌ప‌న వంటి విశిష్ట ల‌క్ష‌ణాలు క‌లిగిన దేశం ఆఫ్ఘ‌నిస్తాన్‌. హింస‌, తుపాకీ ల‌కు స్వ‌స్తి ప‌లికి ఓటు రాజ‌కీయాలు, చ‌ర్చ‌ల ద్వారా త‌మ బంగారు భ‌విష్య‌త్తును తీర్చిదిద్దుకునేందుకు ప్ర‌జ‌లు ప‌డుతోన్న త‌ప‌న‌, పోరాటానికి ఆప్ఘ‌నిస్థాన్ పెట్టింది పేరు. సంప్ర‌దాయాల‌కు పుట్టినిల్ల‌యిన ఈ దేశం ప్ర‌జాస్వామ్య దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఈ ప‌య‌నంలో ప‌లు స‌వాళ్ల‌ను ఎదుర్కొని కొంత మందిని ఓడించ గ‌లిగింది. అందుకోసం కొంద‌రు త‌మ జీవితాల‌ను దేశం కోసం ప‌ణంగా పెట్టారు.దేశ ప్ర‌యో.జ‌నాల కోసం త‌న అసువుల‌ను చాలించారు.నిరుత్సాహం అనే చీక‌టి రోజుల నుంచి భ‌విష్య‌త్ కోసం మాజీ అధ్య‌క్షుడు హ‌మీద్ క‌జ్ ఆయ‌మ సాహెబ్ ఎంతో క‌`షి చేశారు.దూర‌ద‌`ష్టికి, దేశ‌ భ‌క్తి వ‌ల్లే అధ్య‌క్షుడు ఘ‌ని, సీఈవో డాక్ట‌ర్ అబ్దుల్లా ప‌రిపాల‌నాద‌క్ష‌త‌ను సంపాదించ‌గ‌లిగారు. ప్ర‌జ‌ల‌పై విశ్వాసం ఉంచి హింసాత్మ‌క విధానాల‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసి ఎంపీలై పార్ల‌మెంటు వ‌ర‌కు రాగ‌లిగారు. గౌర‌వ‌నీయులైన స‌భ్యులారా….

ఆఫ్గ‌న్లు సాధించిన విజ‌యాలకు ఉప్పొంగి పోతూ మీ బంగారు భ‌విష్య‌త్‌కు సంఘీభావం తెలుపుతూ మీ సోద‌ర భావానికి క‌`త‌జ్నత‌తో 1.25 బిలియన్ భార‌తీయుల ప్ర‌తినిధిగా విన‌మ్ర‌త‌తో మీముందు నిలుచున్నా. ఆప్గ‌న్ అధ్య‌క్షుడు ఘ‌ని, ఎంపీల‌తో క‌లిసి పార్ల‌మెంటులో ప్ర‌సంగించ‌డం ఒక గౌర‌వంగా భావిస్తున్నా. ఆఫ్గ‌నిస్థాన్ దేశానికి ప్ర‌జాస్వామ్యాన్ని అంకితం చేసే ప్ర‌క్రియ‌లో భాగ‌స్వామిన‌వుతున్నా. భార‌త మాజీ ప్ర‌దాని వాజ్‌పేయీ జ‌న్మ‌దినం ఈరోజు కావ‌డం ముదావ‌హం. 11 ఏళ్ల కింద‌ట వాజ్‌పేయీ ఆఫ్గ‌నిస్థాన్‌-ఇండియా భాగ‌స్వామ్యం గురించి క‌ల‌లు కన్నారు. పార్ల‌మెంటులో ఒక బ్లాకుకు వాజ్‌పేయీ పేరు పెట్ట‌డం భార‌తీయుల హ‌`ద‌యాన్ని తాకింది. రెండు దేశాల నాయ‌కులు చేసిన క‌`షి , దూర‌ద‌`ష్టి, వ‌ల్లే ఈరోజు రెండు దేశాల నేత‌లు పార్ల‌మెంటుకు రాగ‌లిగారు. అత‌ల్ బ్లాకు రెండు దేశాల మ‌ధ్య సంబందాల‌ను ప‌టిష్టం చేసింది.అత‌ల్ అంటే హీరో , హిందీలో ధ‌`డ‌మైన వైఖ‌రి అని అర్థం. ఉభ‌య దేశాల స్నేహానికి ది నిద‌ర్శ‌నం.

ప్ర‌జాస్వామ్యం , ప్ర‌గ‌తికి మారు పేరు ఆప్ఘ‌నిస్తాన్ పార్ల‌మెంటు కాంప్లెక్సు. ఉభ‌య దేశాలు ఉన్న‌త విలువ‌ల‌కు, ఉద్వేగాల‌కు గుర్తు. ఆశ‌లు, ఆశ‌యాలు, మ‌మ‌త‌లు, వాత్స‌ల్యం ఉభ‌య దేశాల‌ను క‌ట్టి ప‌డేస్తున్నాయి. గౌర‌వ‌నీయులైన స‌భ్యులారా…మ‌న రెండు దేశాల మ‌ధ్య ఉన్న బంధం చారిత్రాత్మ‌క‌మైన‌ది. రుషులు, వ్యాపార‌స్థులు సంస్క్రుతి, వాణిజ్యం, జ్నానం, ప్ర‌జ్ఞ రెండు దేశాల మ‌ధ్య సంధి కుదిర్చాయి.. ప‌లు స‌మ‌యాల‌లో రెండు దేశాలు ఒక‌టిగా నిలిచాయి. కొన్ని స‌మ‌యాల‌లో యుద్దాల‌ను చూశాం. గ‌త అనుభ‌వాల‌తో రెండు దేశాలు బ‌ల‌ప‌డ్డాయి.ఢిల్లీలోని పురాతన వ‌స్తు సామ‌గ్రి, బౌద్ధుడి శాస‌నాలు, భాష‌, క‌ల‌లు, సంస్క్రుతి సంప్ర‌దాయాలు, ఆహార‌, పండుగ‌ల‌లోరెండు దేశాల సంబంధాలు అభివ్య‌క్తం అవుతాయి.మ‌హాభార‌త‌, గాంధారి క్యార‌క్ట‌ర్లను ప్ర‌దానం చేసిన పురాత‌న ఆప్గ‌నిస్తాకు భార‌త్ రుణ‌ప‌డి ఉంది. మౌర్య ఎంపైర్ విజ‌యాలు ను చూస్తే అప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా రెండు దేశాల పున‌ర్ నిర్మాణానికి అభివ‌`ద్దికి బాట‌లు ప‌డ్డాయ‌ని తెలుస్తుంది.

ఆఫ్ఘాన్‌ ప‌ర్వ‌త శిఖ‌రాల‌ను చూస్తే డిల్లీ సింహాస‌నాన్ని మ‌రిచిపోయానంటూ ఢిల్లీలో ఆఫ్గాన్ రాజు కొన‌సాగాల‌ని ప్ర‌ముఖ క‌వి అహ్మ‌ద్ షా దురానీ భావించి ఉండ‌వ‌చ్చు. ఇరు దేశాల ప్ర‌జ‌ల హ‌`ద‌యాల‌లో అవ‌దులు లేని ప్రేమాభిమానాలున్నాయి. ఉభ‌య దేశాల సంస్క్రుతి సంప్ర‌దాయాలు, సినిమా, సంగీతం, క‌విత్వం, ఆహారం, పండుగ‌లను ఉభ‌యులు అభిమానిస్తారు. ఇపుడు క్రికెట్ ను అభిమానిస్తున్నారు. ఢిల్లీ స‌మీపంలో ఆఫ్ఘాన్ జాతీయ క్రికెట్ టీం వ‌చ్చే ఏడాది ప్ర‌పంచ క‌ప్ పోటీల‌కు సిద్ద ప‌డేందుకు ప్రాక్టీసు చేస్తోంది. మొద‌టి స‌రీస్‌లో ఆఫ్గాన్ అండ‌ర్-19 జింబాబ్వే టీంను మ‌ట్టి క‌ర‌పించినందుకు అభినందిస్తున్నా. విద్య‌, ఆరోగ్య రంగాల‌కు ఆఫ్టాన్ భార‌త్‌ను ఆవ్ర‌యిస్తోంది. స్వాతంత్ర్య స‌మ‌రంలో ఫ్రాంటీర్‌ గాఃంధీగా పేరొందిన ఖాన్ అబ్దుల్ గ‌పార్ ఖాన్ భార‌త్‌కు మ‌ద్ద‌తు ప‌లికిన సంగ‌తి గుర్తుంది. వందేళ్ళ క్రితం .కాబూలులో మ‌హ‌రాజా మ‌హేంద్ర ప్ర‌తాప్‌, మౌలానా బ‌ర్కుతుల్లా భార‌త ప్ర‌భుత్వాన్ని విదేశాల‌లో ఉంటూ రూపొందించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.

ఇండియా కు ప‌ర దేశీయుల నుంచి స్వేచ్చ ల‌భించేదాకా ఆఫ్గ‌నిస్థాన్ కు విముక్తి ల‌బించ‌ద‌ని రాజు అమానుల్లా మ‌హారాజాకు తెలిపిన సంగ‌తి అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. గౌర‌వ‌నీయులైన స‌భ్యులారా….రెండు దేశాల మ‌ధ్య ఉన్న సోద‌ర బంధం అలాంటిది. నూత‌న శ‌తాబ్దంలో కొత్త గా ప‌య‌నిస్తోన్న ఆప్గ‌న్ కు ఇండియా బాస‌ట‌గా ఉంటుంది. మ‌న భాగ‌స్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల‌లో ర‌హ‌దారులు, చిన్న‌త‌ర‌హా సాగు నీటి ప్రాజెక్టులు, పాఠ‌శాల‌లు, ఆరోగ్య కేంద్రాలు, మ‌హిళ‌లకు అవ‌కాశాలు, శిశు సంర‌క్ష‌ణ సాద్య‌మైంది. ర‌హ‌దారుల నిర్మాణాల వ‌ల్ల రెండు ప్రాంతాల మ‌ద్య దూరం త‌గ్గింది. విద్యుత్ లైన్లు, విద్యుత్ కేంద్రాలు ఆఫ్ఘాన్ ఇళ్ల‌కు కాంతులిచ్చాయి..విద్య‌, వైద్యం, ప్ర‌సార రంగాలు శాటిలైట్ లింకుల వ‌ల్ల అభివ‌`ద్ధి చెందాయి.భ‌ద్ర‌తా ద‌ళాలు నిరంత‌రం నిఘాను అన్ని ప్రాంతాల‌లో పెంచేందుకు స‌హ‌క‌రిస్తున్నాయి.. ఆఫ్ఘాన్‌లో వ్య‌వ‌సాయం, మైనింగ్ రంగాలు అభివ‌`ద్ది అయ్యేలా భార‌త్ స‌హ‌క‌రిస్తోంది. కాబూల్లో వైద్య స‌దుపాయాలు మెరుగ‌య్యాయి.మాన‌వ వ‌న‌రుల కంటే ఇత‌ర‌త్రా ఏదీ ముఖ్యం కాదు. ఉప‌కార వేత‌నాలు, శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు ఆఫ్ఘాన్ యువ‌త‌కు సాధికార‌త‌ను చేకూరుస్తున్నాయి. ఆఫ్గాన్‌ను అభివ‌`ద్ధి ప‌ర‌చుకునేందుకు దోహ‌ద‌ప‌డే వ‌న‌రులున్నాయి. భ‌ద్ర‌తా ధ‌ళాలు ఆఫ్గాన్‌ను ర‌క్షించుకునే స్థాయికి ఎదిగాయి. స‌ల్మా డ్యాం ద్వారా త్వ‌ర‌లో సాగు నీరు, విద్యుత్ ఉత్ప‌త్తి అయ్యే అవ‌కాలున్నాయి. స్టార్ ప్యాలెస్ ఒక పురావ‌స్తు సంప‌ద గా నిలుస్తుంది. ఇండియాలో చ‌దివే ఆఫ్గ‌న్ల్ విద్యార్తుల‌కు ప్ర‌తి ఏటా వెయ్యి ఉప‌కార వేత‌నాల స‌దుపాయాన్ని కొన‌సాగిస్తాం. చ‌నిపోయిన ఆఫ్గాన్ భ‌ద్ర‌తా కుటుంబాల్లోని 500 విద్యార్థుల‌కు ఉప‌కార వేత‌నాల‌ను ఇవ్వాల‌ని ఆరోజు ప్ర‌క‌టిస్తున్నా.ఆఫ్గ‌న్ పున‌ర్‌నిర్మాణానికి భార‌త్ తోడ్ప‌డుతోంది. ప్ర‌తి రోజు భార‌త్ కు ఇబ్బందులు ఎద‌రువుతున్నాయి. మీ స‌హ‌కారం వ‌ల్ల భార‌తీయులు క్షేమంగా భ‌ద్రంగా ఉండ‌గ‌లుగుతున్నారు. భ‌ద్ర‌త‌ను క‌ల్పించే విష‌యంలో ఆఫ్గ‌న్లు మ‌ర‌ణానికి కూడా గురి అవుతున్నా భార‌తీయుల‌ను కాపాడుతున్నారు. అందుకు మేము మీకు క‌`త‌జ్న‌త‌లు. ఇక్క‌డ ఉంటోన్న భార‌త రాయ‌బారులు, దౌత్య‌వేత్త‌లు, అధికారులు, వైద్యులు భార‌తీయ కుటుంబాల‌కు సేవ‌ల‌ను అందిస్తున్నారు. కొంద‌రు ఇక్క‌డ భార‌తీయులు ఉండ‌రాద‌ని అంటున్నారు. మ‌రి కొంద‌రు చెడు చేయాల‌న్న దురుద్దేశ్యం క‌లిగి ఉన్నారు. రెండు దేశాల భాగ‌స్వామ్యం బ‌ల‌ప‌డ‌టం మ‌రి కొంద‌రికి ఇష్టం లేదు. కొంద‌రైతే నిరుత్సాహ‌ప‌రిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

మేము ఇక్క‌డ ఉన్నామంటే అది మీ విశ్వాసంతోనే సాధ్య‌మైంది. ప‌ర‌స్ప‌ర భాగ‌స్వామ్యంపై మీరెపుడూ భార‌త్‌పై అవిశ్వాసాన్ని వ్య‌క్తం చేయ‌లేదు. ఉభ‌య దేశాల భాగ‌స్వామ్యంతో సాధించిన ఫ‌లితాల‌ను ప‌రిశీలిస్తే ఈ విష‌యం అర్థ‌మ‌వుతుంది. ఇత‌రులు చెప్పే దానికంటే మీఅంత‌కు మీరే ఫ‌లితాల‌ను చూసి భార‌త్‌ను అభినందిస్తున్నారు. మా దేశం మీతో పోటీ ప‌డ‌టానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు. మిమ్మ‌ల్పి ఉద్ద‌రించేందుకు, మీ దేశం బాగు ప‌డేలా చేసేందుకు భార‌త్ స‌హ‌క‌రిస్తోంది. దేశ విచ్చిత్తి కంటే పున‌ర్ నిర్మాణం, అబివ‌`ద్దే మాకు ముఖ్యం. ఘ‌ర్ష‌ణ‌ల‌కు తావివ్వం. మ‌న రెండు దేశాలు ఎన్న‌డూ వ్య‌తిరేకంగా కాక ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటున్నాయి. రెచ్చ‌గొట్టే విధానాల‌కు, లేనిపోని పోటీకి దూరంగా ఉండే ఆఫ్గాన్ చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే ఈ విష‌యం అర్థ‌మ‌వుతుంది. మీ దేవ‌ అభివ‌`ద్ది కోసం ఇండియా నిరంత‌రం పాటుప‌డుతుంది. స్వ‌పారిపాల‌న‌, భ‌ద్ర‌త‌, అబివ‌`ద్దికి మేము తోడ్ప‌డుతాము. స్రేహ‌భావం వ‌ల్ల వ‌చ్చిన బాద్య‌త‌ను అమ‌లు చే్స్తాం. అదే విధంగా భార‌త్ లో శాంతి, స్థిర‌త్వం పాదుకునేలా చేస్తాం. పొరుగు దేశాల‌ ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం తోనే ఆఫ్గ‌న్ విజ‌యం ఆధార‌ప‌డిఉంది. ఇండియా, పాకిస్థాన్ , ఇరాన్ త‌దిత‌ర దేశాలు ఉమ్మ‌డి గా ఉండి ల‌క్ష్య సాధ‌న కు ప్ర‌య‌త్నం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. మీ దేశం శాంతికి కేంద్ర బిందువు అయితే పెట్టుబ‌డుల మ‌ళ్లింపు ద్వారా అభివ‌`ద్ది సాధ్యం అవుతుంది. అందుకే ఉమ్మ‌డిగా క‌`షి చేయాల‌ని కోరుతున్నాం.ద‌క్షిణాసియా-ఆఫ్గ‌న్ మ‌ధ్య పాకిస్థాన్ వార‌దిగా ఉండాలి.మ‌ధ్య ఆసియా నుంచి అందే సాయం వ‌ల్ల రీజియ‌న్ అభివ‌`ద్ద‌ఙ చెంద‌గ‌ల‌ద‌ని విశ్వ‌సిస్తున్నా.టెర్ర‌రిజం స‌రిహ‌ద్దుల‌లో బ‌ల‌హీనప‌డిన‌పుడే ఆఫ్ఘాన్ విజ‌యం వైపు ప‌రుగుతీస్తుంది. ఉగ్ర‌వాద కేంద్రాల‌ను మూసివేసిన‌పుడే అభివ‌`ద్ది సాద్య‌ప‌డుతుంది. ఉగ్ర‌వాదం, హింసాకాండ ఆష్గాన్ను అభివ‌`ద్ది ప‌థంలో న‌డ‌ప‌లేవు. అబివ‌`ద్ది జ‌ర‌గాల‌న్న దాహాగ్ని మీలో చ‌ల్లార‌రాదు.

పొరుగు దేశాల‌తో స్నేహంగా ఉంటూ శాంతి ని కాంక్షించే వివేకం తో పాటు త‌మ‌ను తాము ర‌క్షించుకుంటూ స్వేచ్చ‌గా బ్ర‌తికేందుకు ఆఫ్గాన్లు ఇష్ట‌ప‌డ‌తారు. ఈప్ర‌య‌త్నంలో వారు విజ‌యాన్ని సాధించి శాంతికి ప‌ట్టంక‌ట్టాలి. కాబూలు న‌ది ఇప్ప‌టికే ర‌క్త‌సిక్తం అయ్యింది. ప‌ర్వ‌త ప్రాంతాల‌లో అనేక దుస్సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. ఘ‌ర్ష‌ణ వైఖ‌రుల‌తో క‌ల‌లు కాలి వాలి బూడిద‌య్యాయి. ఆఫ్గాన్ లో ముస్లింలు, హిందువులు, సిక్కులు ఇత‌ర కులాలుండ‌వ‌చ్చు. భిన్న‌త్వంలో ఏక‌త్వంలాగా ఆఫ్గాన్లంతా ఒక్క‌టే. ఒక్క‌డిగా ఉండేదుకు గ‌ర్వ‌ప‌డాలి. గుర్తింపు కోసం, మ‌తం కోసం ఇది వ‌ర‌కు యుద్దాలు జ‌రిగి ఉండ‌వ‌చ్చు. అయితే ఇపుడు అంద‌రు ఏక‌తాటిపైకి వ‌చ్చే స‌మ‌యం ఆస‌న్న‌మైంది.

విషాన్ని వెద‌జ‌ల్లే విత్త‌నాల చెట్టుకు చ‌క్కెర‌, బ‌ట్ట‌ర్ వేసినంత మాత్రాన పుట్టుక‌తో వ‌చ్చిన గుణం మారుతుందా అని ఒక తెలివైన ఆఫ్గాన్ వ్యాఖ్యానం ప‌రిస్థితికి అద్దం ప‌డుతుంది. ఆఫ్గాన్ పున‌ర్ నిర్మాణానికి బ‌య‌ట నుంచి యుద్దాల‌ను రెచ్చ‌గొట్టే వారు ప్ర‌య‌త్నించాలి. గ‌న్నుల‌తో కాకుండా బ్యాలెట్ ప త్రాల‌తో అదికారాన్ని చేజిక్కించుకోవాలి. ఇళ్ల‌ను కూల్చిన వారు ఇక‌నైనా త‌మ దేశ‌ పున‌ర్ నిర్మాణానికి పాటు ప‌డాలి. ఇత‌రుల జోక్యం లేకుండా మీరే మీ దేశాన్ని అభివ‌`ద్ధి పంథాలో న‌డిపించాలి.చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాలి. శాంతికాముకులుగా ఉండి అభివ‌`ద్ది ని జ‌యించాలి. ప్ర‌తి ఒక్క‌రి హ‌`ద‌యంలో విశ్వ‌స‌నీయ‌త‌ పాదు కొనేలా చేయాలి. మీ అభివ‌`ద్దికి మీరే బాధ్యులు… ఆఫ్ఘాన్ లో స‌రికొత్త ఉగ్ర‌వాద, తీవ్ర‌వాద మేఘాలు క‌మ్ముకొస్తున్నాయి.ఈనేప‌థ్యంలో ఆదేశీయుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాలి. వారు త‌మ భ‌విష్య‌త్తు కోసం పోరాటం చేస్తున్నారు. భ‌ద్ర‌త ఉన్న ప్ర‌పంచం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈప్ర‌య‌త్నాలు మ‌రింత బ‌ల‌ప‌డాలి. వారి ప్ర‌య‌త్నాలు వ‌మ్ము కావు. శాంతి జ్వాల ఆర‌రాదు. ఏ యువ‌తి అవ‌కావాలు కోల్పోయి చీక‌టిలో మ‌గ్గ‌రాదు. ఏ కుమారుడు కూడా తుపాకీయే ప్ర‌త్య‌మ్నాయ‌మ‌ని భావించ‌రాదు. ఏ త‌ల్లి కూడా త‌న బిడ్డ గురించి ఆందోళ‌న చెంద‌రాదు. స్వేచ్చ స్వాతంత్ర్యాల గురించి మాట్లాడే నేత‌లు త‌మ సోద‌రుల‌ను ఏనాడూ కోల్పోరాదు. ఏ ఒక్క‌రు మ‌తం పేరుతో మ‌సీదుల‌లో ప్రార్థ‌న చేసే వారిని హ‌త‌మార్చ‌రాదు. భ‌విష్య‌త్తు లేద‌ని ఏ ఒక్క రు వెను దిర‌గ‌రాదు.ఐటీ ద్వారా త‌న భ‌విష్య‌త్తును నిర్మించుకోవాలే గానీ ఉగ్ర‌వాదం వ‌ల్ల కాదు.21 వ శ‌తాబ్దం లో మ‌రిన్ని అవ‌క‌శాలు ఆఫ్ఘాన్ల యువ‌త‌కోసం ఎదురు చూడాలి. భార‌త దేశం క‌మిట్‌మెంటు ఏమిటంటే ..

మీ క‌ష్టాలు మాకు బాధ‌ను క‌లిగిస్తాయి

మీ క‌ల‌లను నెర‌వేర్చ‌డం మా విధి

మీ బ‌లం మా విశ్వాసం

మీ ధైర్య‌సాహ‌పాలే మా నమ్మ‌కం

చివ‌ర‌గా మీ స్నేహ భావ‌మే మాకు గౌర‌వం

ప్ర‌ముఖ హిందీ సినిమా జంజీర్‌లో ప‌టాన్ కేరెక్ట‌ర్ షేర్ ఖాన్ పాడిన విధంగా ..

యారీ హై ఉమాం మేరా, యార్ మేరీ జింద‌గీ

స్నేహ‌మే నా న‌మ్మ‌కం. స్రేహితుడే నా జీవితం. ఈ భావమే ఉభ‌య దేశాల‌ది.

నాకు న‌మ్మ‌కం ఉంది. మీ ఇళ్ల‌లో ఆశ‌లు చిగురించాలి. పాఠ‌శాల‌లో్లో చిరున‌వ్వు క‌నిపించాలి. మీ న‌గ‌రాల‌లో సంప‌ద వెల‌యాలి. దేశంలో శాంతి నెల‌కొనాలి.ప్ర‌తి అడుగులో మీకు ఇండియా తోడుగా ఉంటుంది. థ్యాంక్యు.