Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జపాన్ లోని టోక్యో లో జ‌రిగిన ‘మేక్ ఇన్ ఇండియా’ స‌ద‌స్సు లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

జపాన్ లోని టోక్యో లో జ‌రిగిన ‘మేక్ ఇన్ ఇండియా’ స‌ద‌స్సు లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

జపాన్ లోని టోక్యో లో జ‌రిగిన ‘మేక్ ఇన్ ఇండియా’ స‌ద‌స్సు లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

జపాన్ లోని టోక్యో లో జ‌రిగిన ‘మేక్ ఇన్ ఇండియా’ స‌ద‌స్సు లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ టోక్యో లో ఈ రోజు జ‌రిగిన ‘మేక్ ఇన్ ఇండియా: ఇండియా – జ‌పాన్ పార్ట్‌న‌ర్‌శిప్ ఇన్ ఆఫ్రికా అండ్ డిజిట‌ల్ పార్ట్‌న‌ర్‌శిప్’స‌ద‌స్సు ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

వ్యాపారం చేయ‌డం లో స‌ర‌ళ‌త్వాన్ని, పౌరుల జీవ‌నంలో సౌల‌భ్యాన్ని మెరుగు ప‌ర‌చ‌డం లో కేంద్ర ప్ర‌భుత్వం ఏ విధ‌మైన శ్ర‌ద్ధ ను తీసుకొంటోందీ ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. భార‌త‌దేశం లో జ‌పాన్ కు చెందిన కంపెనీ లు పెద్ద సంఖ్య లో ఏర్పాటు కావడం ప‌ట్ల ఆయ‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. భార‌త‌దేశం లో అనేక ముఖ్య‌మైన పారిశ్రామిక ప‌థ‌కాల లో ఒక భాగ‌స్వామి గా జ‌పాన్ ఉంటున్న విష‌యాన్ని ప్ర‌ధాన మంత్రి వెల్ల‌డిస్తూ, గ‌త నాలుగు సంవ‌త్స‌రాల లో భార‌త‌దేశం యొక్క ఆర్థిక ప‌నితీరు ఎంత బ‌లంగా ఉన్న‌దీ కూడా ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. భార‌త‌దేశం ప్ర‌స్తుతం అత్యంత వేగంగా వ‌ర్ధిల్లుతున్న ప్ర‌ధాన ఆర్థిక వ్య‌వ‌స్థ గా ఉంద‌ని ఆయ‌న తెలిపారు. భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ లో- అనియ‌మిత‌ ఆర్థిక వ్య‌వ‌స్థ వైపు నుండి నియ‌మానురూప ఆర్థిక వ్య‌వ‌స్థ వైపున‌కు మ‌ళ్ళ‌డం, డిజిట‌ల్ లావాదేవీ లు మ‌రియు జిఎస్‌టి ల వంటి మార్పులతో పాటు ఇత‌ర ప్ర‌ధానమైనటువంటి ప‌రివ‌ర్త‌న‌ లు చోటు చేసుకొన్నాయని ఆయ‌న ప్ర‌స్తావించారు.

భార‌త‌దేశం లో పెరుగుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ, శ‌ర వేగంగా ఎదుగుతున్న మ‌ధ్య‌త‌ర‌గతి, ఇంకా దేశ జ‌నాభా లో యువ‌జ‌నుల సంఖ్య విస్తరిస్తుండడం వంటివి జ‌పాన్ కు చెందిన పెట్టుబ‌డిదారు సంస్థ‌ల కు అనేక నూత‌న అవ‌కాశాల‌ ను ప్ర‌సాదిస్తున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ సంద‌ర్భం లో ఆయ‌న త‌క్కువ ఖ‌ర్చు తో కూడిన త‌యారీ, ఐటి ప‌రిశ్ర‌మ, ఇంకా ఎల‌క్ట్రిక్ మొబిలిటీ త‌దిత‌ర రంగాల ను గురించి ప్ర‌స్తావించారు.

భార‌త‌దేశానికి, జ‌పాన్ కు మ‌ధ్య నెల‌కొన్న‌టువంటి ఉమ్మ‌డి విలువ‌ల‌ ను గురించి ప్ర‌ధాన మంత్రి నొక్కి ప‌లికారు. ఇండో ప‌సిఫిక్, ద‌క్షిణ ఆసియా, ఇంకా ఆఫ్రికా లు స‌హా ప్ర‌పంచం లోని ఇత‌ర ప్రాంతాల లో బ‌ల‌మైన అభివృద్ధియుత భాగ‌స్వామ్యాల‌ ను ఏర్ప‌ర‌చుకోవ‌డం కోసం ఉభ‌య దేశాలు అన్వేష‌ణ సాగిస్తాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.