Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసుపత్రిలో లాన్స్ నాయక్ హనుమంతప్పను కలుసుకున్న ప్రధాన మంత్రి

ఆసుపత్రిలో లాన్స్ నాయక్  హనుమంతప్పను కలుసుకున్న ప్రధాన మంత్రి


సియాచిన్ హిమ ప్రవాహ ఘటన లో ప్రాణాలతో బ‌తికి బయటపడిన‌ లాన్స్ నాయక్ హనుమంతప్పను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆసుపత్రిలో కలుసుకున్నారు. ఆ సైనికుడిని హిమ నదం వద్ద నుంచి ఈ రోజే విమానం ద్వారా న్యూఢిల్లీ లోని ఆర్మీ ఆర్ ఆర్ ఆసుపత్రికి తరలించారు.

లాన్స్ నాయక్ హనుమంతప్ప ఆరోగ్య స్థితిని గురించి ప్రధాన మంత్రికి ఈ సందర్బంగా వివరించారు. సైనికుడితో ఆయన సుమారు 10 నిముషాలు పాటు ఉన్నారు. లాన్స్ నాయక్ హనుమంతప్ప కు వైద్యం చేస్తున్న డాక్టర్ల బృందాన్ని, సిబ్బందిని ప్రధాన మంత్రి కలుసుకుని ఆయనకు అవ‌స‌ర‌మైన‌ చికిత్సను అందించటంలో ఎటువంటి లోటు రానీయ‌కుండా చూడాలని స్పష్టం చేశారు.

“లాన్స్ నాయక్ హనుమంతప్ప ప్రదర్శించిన మొక్కవోని ధైర్య సాహసాలను, సహనశీలతను వర్ణించటానికి మాటలు చాలవు. ఆయన ఓ శ్రేష్ఠుడైన‌ జవాను” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సైనిక దళ ప్రధాన అధికారి దల్బీర్ సింగ్ కూడా పాల్గొన్నారు.

***