వేదిక ను అలంకరించిన శ్రీ ప్రొఫెసర్ జగదీశ్ ముఖీ, ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ, సోదరులు శ్రీ హేమంత్ బిశ్వాస్ శర్మ, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ రాజేన్ గొహైన్, ఇతర ప్రముఖులు, సభ కు హాజరైన సోదరులు మరియు సోదరీమణులారా,
మీ దీవెనల ను నా మీద వర్షించడం కోసం ఇంత పెద్ద సంఖ్య లో మీరంతా తరలివచ్చినందుకు నేను నిజం గా మీకు కృతజ్ఞుడి ని. ఈ రోజు యావత్తు ఈశాన్య భారతాని కి ఒక చరిత్రాత్మకమైన రోజు. దేశం లో అత్యంత పొడవైన రోడ్డు-రైలు వంతెన ఈ ప్రాంతం లో రూపుదిద్దుకొన్నందుకు మీకందరి కి ఇవే నా అభినందనలు.
కొద్ది సేపటి క్రితమే నేను ఈ వంతెన మీదు గా ఇక్కడకు చేరుకొన్నాను. ఈ అనుభూతి నాకు అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చింది.
మిత్రులారా,
ప్రపంచమంతా ఈ రోజు న క్రిస్ మస్ ను జరుపుకొంటోంది. క్రిస్ మస్ సందర్భం గా అసమ్ తో పాటు యావత్తు భారతదేశాని కి ఇవే నా శుభాకాంక్షలు. అహోం సామాజిక వర్గాని కి జీవితాన్ని అంకితం చేసిన స్వర్గదేవ్ చౌలంగ్ సుకఫా కు శిరస్సు ను వంచి నమస్కరిస్తున్నాను. అలాగే లచిత్ బోర్ఫుకన్, బీర్ చిలారాయ్, స్వర్గదేవ్ సర్బానంద సింఘ, బీరానంద సతి సాధని, బొడోసా, బీర్ రాఘవ్ మోరాన్, మాణిక్ రాజా, సతి జోయ్‌మతి, ఇంకా సతి రాధిక ల వంటి సాహసం మరియు త్యాగం మూర్తీభవించిన ఎందరో శూర పురుషులు మరియు ధీర మహిళ లకు నేను నివాళులను అర్పిస్తున్నాను.
స్వాతంత్ర్య ఉద్యమం నాటి నుండి అసమ్- భారత పునర్నిర్మాణం దాకా ఎందరెందరో వారి వంతు గా నిరుపమానమైనటువంటి తోడ్పాటు ను అందించారు. రాజకీయాల నుండి సమాజ సేవ దాకా, విద్య నుండి విజ్ఞాన శాస్త్రం – సాంకేతిక విజ్ఞానం దాకా, క్రీడారంగం లో సైతం తమ రాష్ట్రం తో పాటు దేశం మొత్తం గర్వపడేలా చేసిన అసమ్ వాస్తవ్యులందరికీ నేను ‘కార్యాంజలి’ని ఘటిస్తున్నాను.
అసమ్ నైటింగేల్ పద్మ శ్రీ దీపాలీ బర్తాకుర్ గారి కి కూడా నేను నివాళిని అర్పిస్తున్నాను. అసమ్ ప్రజలు దేశ విదేశాల లో అసంఖ్యాక ప్రదేశాలకు చేరుకొనేటట్లు చేసిన ఒక గళాన్ని- ఆమె మృతి తో- మనం కోల్పోయాం.
మిత్రులారా,
ఈ రోజు దేశ సుపరిపాలన కు అంకితం అయినటువంటి అత్యంత ఘన వ్యక్తులలో ఒకరైన మరియు మన కు అత్యంత ప్రియతములైన కీ.శే. అటల్ బిహారీ వాజ్‌పేయి గారి జయంతి కూడాను. ఈ రోజు అటల్ జీ జయంతి ని దేశం అంతటా సుపరిపాలన దినం గా జరుపుకొంటున్నాం.
సోదరులు మరియు సోదరీమణులారా,
సుపరిపాలన కు అర్థం ప్రజల ను గురించి తపించడం. సామాన్య మానవుడి జీవితాన్ని మెరుగుపరచే ఒక సంస్కృతి అది. దేశాని కి, సమాజాని కి మెరుగైనటువంటి, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కై స్వార్థ ప్రయోజనాలకు అతీతం గా నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాక మెరుగైన ప్రజా జీవనం కోసం తగిన వ్యవస్థ లను, ఉపకరణాల ను సృష్టించినప్పుడు సుపరిపాలన ‘సురాజ్యం’ వైపు సాగుతుంది. అలాగే ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ మంత్రం తో మనం కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, దేశం సమతుల అభివృద్ధి కోసం పని చేస్తే సుపరిపాలన ‘సురాజ్యం’ వైపు సాగుతుంది. మిత్రులారా, గడచిన నాలుగున్నర సంవత్సరాల లో కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు అసమ్ ప్రభుత్వం, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇదే మార్గం లో నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. ఇవాళ ఈ శుభ దినాన మనమంతా సుపరిపాలన కు గొప్ప ప్రతీక అయిన ఈ చరిత్రాత్మక బోగీబీల్ రోడ్డు-రైలు వంతెన ప్రారంభోత్సవం కోసం ఇక్కడ హాజరు కావడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. ఇది దేశం లోనే అత్యంత పొడవైన రోడ్డు-రైలు వంతెన. దేశం లోనే మొత్తం ఉక్కు తో నిర్మించిన మొట్టమొదటి వంతెన ఇదే. బ్రహ్మపుత్ర నది నీటి ఉపరితలానికి 30 మీటర్ల ఎత్తు న నిర్మించిన వంతెన ఇది. మన ఇంజినీరింగ్, సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాల కు తిరుగులేని నిదర్శనం ఇది. రైలు మోసుకుపోయే బరువునే కాకుండా రైలు యొక్క వేగాన్ని కూడా భరించగల ఈ వంతెన దేశ వ్యూహాత్మక శక్తి ని సైతం మరింత బలోపేతం చేయగలదు.
సోదరులు మరియు సోదరీమణులారా,
ఇది కేవలం ఒక వంతెనే కాదు ఈ ప్రాంత ప్రజల ను సంధానించే ఓ జీవన రేఖ కూబిను. అసమ్- అరుణాచల్ ప్రదేశ్ ల మధ్య దూరాన్ని ఈ వంతెన తగ్గించేసింది. ఇటానగర్ మరియు డిబ్రూగఢ్ ల మధ్య ఇక రైలు ప్రయాణం 700 కిలోమీటర్ల నుండి 200 కిలోమీటర్ల కన్న తక్కువ కు పరిమితం అయింది. ఇంతకు ముందు ఈ రైలు పయనాని కి 24 గంటలు పట్టేది. ఇప్పుడు దీనికి ఐదు ఆరు గంటలు మాత్రమే పడుతుంది. ఈ 5 కి.మీ. పొడవైన వంతెన అసమ్ లోని తిన్ సుకియా, అరుణాచల్ ప్రదేశ్ లోని నాహర్ లగున్ ల మధ్య దూరాన్ని తగ్గించడమే కాక ప్రజల కు అనేక రకాల ఇబ్బందుల నుండి విముక్తి ని ప్రసాదించి వారి జీవితాల ను సులభతరం చేసింది.
ధేమాజీ, లఖింపుర్ జిల్లా లు మాత్రమే కాక అరుణాచల్ ప్రదేశ్ లోని వివిధ జిల్లాల ప్రజలు ఇంతకుముందు బ్రహ్మపుత్ర నది ని దాటాలంటే పడవల ను ఉపయోగించే వారని నేను విన్నాను. లేదంటే అనేక రైళ్లు లేదా బస్సులు మారుతూ మొత్తం రోజంతా ప్రయాణించవలసి వచ్చేదని నాకు చెప్పారు. సోదరులు మరియు సోదరీమణులారా, ఇవాళ నేను జెండా ను చూపినటువంటి రైలు 14 బోగీల తో రెండు రాష్ట్రాల మధ్య కేవలం రెండు మూడు గంటలలో నేరు గా ప్రయాణిస్తుంది. ఈ ప్రాంతం లో ఇది అనూహ్యమైనటువంటి మార్పుల ను తీసుకువస్తుంది. ఈ సదుపాయం కోసం తరతరాలు గా ప్రజలు కంటున్న కలలు చివర కు నేడు నెరవేరాయి. దీని వల్ల ఈ ప్రాంతం నుండి ఢిల్లీ, ముంబయి, కోల్‌కాతా, బెంగళూరు లకు ప్రయాణించాలంటే ఇక మీదట గువాహాటీ కి వెళ్లనక్కర లేదు. విద్య, ఆదాయం, వ్యాపారాల కు సంబంధించి డిబ్రూగఢ్ ప్రధాన కేంద్రం గా ఉంది. ఈ ప్రాంతాన్ని సందర్శించడం ప్రజల కు ఒక ప్రధానమైన అవసరం. గంభీర వ్యాధి బారి న పడితే, సుదీర్ఘ ప్రయాణాలు రోగి పట్ల ప్రాణాంతకం కావచ్చన్న విషయం మీరందరూ ఎరుగుదురు.
మిత్రులారా,
బ్రహ్మపుత్ర ఉత్తర ఒడ్డు న నివసించే ప్రజల కు డిబ్రూగఢ్ వైద్య కళాశాల, ఆసుపత్రి మరియు విశ్వవిద్యాలయం వంటి సౌకర్యాలు కేవలం కొన్ని నిమిషాల ప్రయాణం తో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ప్రధాన సదుపాయాన్ని పొందగలిగింనందుకు ఈశాన్యం భారతం తో పాటు యావత్తు దేశ ప్రజానీకాని కి ఇవే నా అభినందనలు.
అత్యంత క్లిష్ట పరిస్థితుల నడుమ ఈ వంతెన నిర్మాణం లో అహోరాత్రాలూ పాలుపంచుకున్న ఇంజినీర్లు, కార్మికులు.. మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మీకందరకూ అనేకానేక అభినందనలు.
సోదరులు మరియు సోదరీమణులారా,
దేశం లో అత్యంత పొడవైన రోడ్డు వంతెన, రైలు వంతెన రెండూ అసమ్ లోనే ఉండటం ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకే గాక ఈశాన్య ప్రాంతం అంతటికీ జంట సంబరాల దినం. దేశం లో రెండు ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ను పూర్తి చేసే సదవకాశం భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వానికి దక్కడం ఎంతో అదృష్టం.
నిరుడు మే నెల లో భూపేన్ హజారికా వంతెన ను ప్రారంభించడం కోసం నేను సాదియా ను సందర్శించాను. ఇవాళ మీ అందరితో కలసి బోగీబీల్ వంతెన మీద సగర్వం గా నిలుచున్నాను. సోదరులు మరియు సోదరీమణులారా, బ్రహ్మపుత్ర నది మీద గత నాలుగున్నర సంవత్సరాల లో నిర్మించిన మూడో వంతెన ఇది. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం 60- 70 సంవత్సరాల లో బ్రహ్మపుత్ర పైన మూడు వంతెన లు నిర్మితం అయ్యాయి. అలాగే మేం అధికారం లోకి వచ్చాక మరో 3 వంతెనల ను నిర్మించాం.. కాకపోతే వీటి ని కేవలం నాలుగున్నర సంవత్సరాలలో మేం పూర్తి చేశాం. ఇవే కాకుండా మరో 5 కొత్త వంతెనల నిర్మాణం కొనసాగుతోంది. ఈ వంతెనలన్నీ పూర్తి అయ్యాక బ్రహ్మపుత్ర ఉత్తర, దక్షిణ తీరాల మధ్య సంధానం మెరుగుపడుతుంది. తద్వారా ఆహార, పారిశ్రామిక, వాణిజ్య రంగాల లో ఒక కొత్త అధ్యాయం లిఖించబడుతుంది.
మిత్రులారా,
సుపరిపాలన అంటే ఇదీ. మనం ఇప్పుడు ‘సురాజ్యం’ వైపు పయనిస్తున్నాం. అందుకే ఈ ప్రగతి వేగం అసమ్ సహా ఈశాన్య భారత రూపురేఖల ను రూపాంతరీకరణ చేయగలదని మేం దృఢ విశ్వాసం తో చెప్పగలం.
సోదరులు మరియు సోదరీమణులారా,
అటల్ గారు 16 సంవత్సరాల కిందట ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు హాజరైన వారి లో కొందరు బహుశా ఇవాళ ఇక్కడకు వచ్చి ఉండవచ్చు. ఆనాటి తో పోలిస్తే మొత్తం ఓ తరమే మారిపోయింది. మీరంతా నిజం గా ఎంతో ఓర్పు తో చాలా కాలం పాటు వేచి ఉండవలసి వచ్చింది. మిత్రులారా, ఈ వంతెన కావాలన్న మీ చిరకాల వాంఛ మేరకు రెండు దశాబ్దాల కిందట పనులు ఆరంభం అయ్యాయి. అయితే, వాస్తవం ఏమిటంటే అటల్ గారి చొరవ తోనే అదీ సాధ్యమైంది. కానీ, దురదృష్టవశాత్తూ 2004వ సంవత్సరం లో ఆయన ప్రభుత్వానికి కాలం తీరిపోవడంతో అనేక ఇతర ప్రాజక్టుల లాగే ఈశాన్య భారతం లోని ఈ ప్రాజెక్టు కూడా మధ్యలోనే నిలచిపోయింది.
సోదరులు మరియు సోదరీమణులారా,
ఈ వంతెన పరిస్థితి 2014 లో ఎలా ఉందన్న దానికి మీరంతా సాక్షులే. అసంపూర్తిగా నిలచిన స్తంభాలు తప్ప మరేమీ కనిపించేవి కావు. మేం 2014 లో ఎన్నికై అధికారం చేపట్టే నాటికి వంతెన 50 శాతానికి పైగా అసంపూర్తి గా ఉంది. అయితే, అటల్ గారి ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ వంతెన 2007-08 కల్లా పూర్తి అయ్యి, ప్రారంభోత్సవానికి నోచుకొని ఉండేదన్నది వాస్తవం. కానీ, ఆ తరువాత కేంద్రం లో అధికారం లోకి వచ్చిన ప్రభుత్వం మీ అవసరాల పైన ఏ మాత్రం శ్రద్ధ వహించలేదు. ఆ పరిస్థితులలో 2014 లో మా ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ ప్రాజెక్టు కు గల అడ్డంకులన్నీ తొలగించి, పనుల ను వేగిరపరచాం. ఫలితం గా 6,000 కోట్ల రూపాయల తో నిర్మించిన బోగీబీల్ వంతెన నేడు ప్రజల కు సేవలు అందించేందుకు దేశ ప్రజలకు అంకితం చేయబడింది. అటల్ గారి కలల్లో ఒక కల ను నెరవేర్చడం ద్వారా నేడు ఆయన జయంతి సందర్భం గా దేశం కృతజ్ఞతాపూర్వక నివాళి ని అర్పించింది. అటల్ గారు ఏ లోకం లో ఉన్నా ఈశాన్య భారత వాసులు ఈ బహుమతి ని అందుకోవడం ఆయన ఆత్మ కు ఎంతో శాంతి చేకూరివుంటుంది. ముఖ్యం గా మీ వదనాలలో ఆనందాన్ని చూసి సంతోషం తో ఉప్పొంగిపోయి ఉంటుంది.
మిత్రులారా,
మునుపటి ప్రభుత్వం అసంపూర్తి ప్రాజెక్టుల కు ప్రసిద్ధమైతే మా ప్రభుత్వం రవాణా సౌకర్యాల తో పరివర్తనను తీసుకురావడం లో పేరు పొందింది. అలాగే దేశం లో నేడు రూపుదిద్దుకొంటున్న భవిష్యత్తు తరం మౌలిక సదుపాయాల కు ప్రతీక గా మారింది.
దేశం లో ఏళ్ల తరబడి అర్ధాంతరంగా ఆగిన లేదా నత్తనడక న పనులు సాగుతున్న రూ.12 లక్షల కోట్ల కు పైగా విలువైన ప్రాజెక్టుల ను మా ప్రభుత్వం గుర్తించింది. అదే మందగమనం తో పనులు సాగుతూండి ఉంటే మరో దశాబ్దం తరువాత సైతం అవి పూర్తి అయ్యేవి కావనడం లో సందేహం లేదు. అయితే- ‘మధ్య లో ఆపేయడం, తప్పుదోవ పట్టించడం’ అనే దుష్ట పని సంస్కృతి ని మేం సమూలం గా మార్చివేశామని సుపరిపాలన దినమైన ఈ రోజు న సగర్వం గా ప్రకటిస్తున్నాం. దేశ మౌలిక సదుపాయాల కు కొత్త రూపు, ఊపు వచ్చిందంటే కారణం ఇదే.
అర్ధాంతరంగా ఆగిన ఇలాంటి వాటి లో మిజోరం లోని తుయీలియల్ జల విద్యుత్తు ప్రాజెక్టు, సిక్కిమ్ విమానాశ్రయం నిరుడు ప్రారంభమయ్యాయి. అదే విధంగా అనేక ప్రాజెక్టు లు పూర్తి కాగా, మిగిలిన వాటి పనులు వేగం గా కొనసాగుతున్నాయి.
మిత్రులారా,
ఇవాళ ప్రతి ప్రాజెక్టు ఎట్టి పరిస్థితి లో నిర్దేశిత కాలావధి లో, అంచనా వ్యయం మించకుండా పూర్తి అయ్యే విధం గా చర్యలు తీసుకొంటున్నాం. ప్రతి పని కి నిర్దిష్ట గడువు అన్నది నేడు కాగితాల కు పరిమితం కాదు.. అది ఒక ప్రభుత్వ కార్యకలాపాల సంస్కృతి గా మారుతోంది. సోనోవాల్ ప్రభుత్వం, ఆయన బృందం ఈ సంస్కృతి ని పూర్తి స్థాయి లో అందిపుచ్చుకోవడం పై అభినందనలు తెలుపుతున్నాను.
అసమ్ లో సంవత్సరాల తరబడి పూర్తి కాని అనేక ప్రాజెక్టుల లో అధిక శాతం నేడు పూర్తి కాగా, మరికొన్నింటి పనులు కొనసాగుతున్నాయి. కేవలం నాలుగున్నర సంవత్సరాలలో 3,000 కోట్ల రూపాయల వ్యయం తో 700 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయింది. అలాగే 6,000 కోట్ల రూపాయల తో చేపట్టిన మరో 12 కు పైగా జాతీయ రహదారుల పనులు కూడా వేగం గా సాగుతున్నాయి. విమానాశ్రయ టర్మినల్, విద్యుదీకరణ, రైలు మార్గాల వెడల్పు పెంపు (బ్రాడ్ గేజ్), గువాహాటీ-తిన్ సుకియా గొట్టపుమార్గం, గువాహాటీ లో ఎఐఐఎంఎస్, ధేమాజీ లో వ్యవసాయ పరిశోధన కేంద్రం వంటి వాటి లో కొన్ని ఇప్పటికే పూర్తి కాగా, మరికొన్ని త్వరలో పూర్తి కానున్నాయి. వేగవంతమైన ఇంటర్ నెట్ సేవల కోసం వేస్తున్న అంతర్జాతీయ సముద్ర అంతర్భాగ కేబుల్ ఇప్పుడు త్రిపుర దాకా పూర్తి కాగా, త్వరలో అసమ్ కు చేరనుంది. దీని తో డిజిటల్ సేవల ప్రదానం కూడా బలోపేతం కానుంది.
మిత్రులారా,
తూర్పు భారతం ముందడుగు వేస్తే మొత్తం భారతదేశమే ప్రగతిపథాన పయనిస్తుందన్నది నా గట్టి నమ్మకం. అదే విధంగా తూర్పు భారతం బలోపేతమైతే, దేశమంతా శక్తిమంతం అవుతుంది. ఈ తూర్పు భారతం లో ఈశాన్య భారత రాష్ట్రాలు ఒక అవిభాజ్య భాగం. అందుకే మౌలిక సదుపాయాల విస్తరణ ను అసమ్ తో పాటు ఈశాన్యం అంతటా విస్తరిస్తున్నాం. అందులో భాగం గా ఈశాన్య భారతం లో దాదాపు 70,000 కోట్ల రూపాయలతో 5,500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టగా, అందులో 2,500 కిలోమీటర్ల మేర పనులు పూర్తి అయ్యాయి. మరోవైపు అంతర్జాతీయ అనుసంధాన తూర్పు కార్యాచరణ విధానం కింద 1,000 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం సాగుతోంది. ఇందులో 800 కిలోమీటర్ల పొడవైన రహదారుల నిర్మాణం భిన్న స్థాయులలో ముందుకు వెళ్తోంది. ఇక రైలుమార్గ అనుసంధానానికి వస్తే- ఈశాన్య భారతంలోని రాష్ట్ర రాజధాని నగరాలన్నిటినీ కలుపుతూ రెండు మూడేళ్లలో బ్రాడ్ గేజ్ విస్తరణ పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఆ మేరకు 15 కొత్త రైలు మార్గాల పనుల ను సుమారు 47,000 కోట్ల రూపాయల తో చేపట్టాం. తదనుగుణం గా ఈశాన్య భారతం లో 1,000 కిలోమీటర్ల దాకా.. అంటే దాదాపు పూర్తి మార్గాల ను ఇప్పటికే బ్రాడ్ గేజ్ చేశాం. ఇంతకు ముందు ఏడాది కి 100 కిలోమీటర్ల మేర రైలు మార్గాల నిర్మాణం లేదా బ్రాడ్ గేజ్ మార్పు పనులు సాగేవి. కానీ, గడచిన నాలుగున్నర సంవత్సరాలు గా ఏడాది కి 350 కిలోమీటర్ల మేర నిర్మాణం లేదా గేజ్ మార్పిడి పూర్తి చేస్తున్నాం. అంతేకాకుండా 19 జలమార్గాల పనులు కూడా ప్రగతిపథం లో ఉన్నాయి. చిట్టగాంగ్, మోంగ్లా రేవుల ను కలుపుతూ అసమ్ లోనూ బ్రహ్మపుత్ర, బరాక్ నదుల పై జలమార్గాల ను నిర్మిస్తున్నాం.
సోదరులు మరియు సోదరీమణులారా,
మౌలిక సదుపాయాల పథకాల తో పాటు ప్రజల జీవన ప్రమాణాల ను పెంచేందుకు ఉద్దేశించిన అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు ను అసమ్ ప్రభుత్వం వేగవంతం చేసింది. తదనుగుణం గా బాలల కు విద్య, యువత కు ఆదాయార్జన, పెద్దల కు మందులు, రైతుల కు నీటి పారుదల సదుపాయాలు సహా ప్రజా సమస్యల సత్వర పరిష్కారం సాధ్యమవుతోంది. అసోం పేద సోదరీమణులకు ఉజ్వల యోజన కింద 24 లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయబడ్డాయి. దీనివల్ల రాష్ట్రంలో నాలుగేళ్ల కిందట 40 శాతం ఇళ్ల కు మాత్రమే గ్యాస్ కనెక్షన్ లు ఉండగా నేడు రెట్టింపు పెరిగి 80 శాతం నివాసాల కు గ్యాస్ అందుతోంది. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం లో భాగం గా అసమ్ లో దాదాపు 32 లక్షల మరుగుదొడ్లను నిర్మించగా నాలుగున్నర సంవత్సరాల కాలం లో పారిశుధ్య విస్తరణ 38 శాతం నుండి 98 శాతాని కి పెరిగింది. సౌభాగ్య యోజన కింద కేవలం ఏడాది కాలం లో అసమ్ లోని 12 లక్షలకుపైగా కుటుంబాల కు ఉచిత విద్యుత్ కనెక్షన్ లు ఇవ్వబడ్డాయి. దీంతో రాష్ట్రం లో విద్యుదీకరణ స్థాయి 50 శాతం నుండి 90 శాతానికి పెరిగింది. అలాగే ఇక్కడి తేయాకు తోటల్లో పనిచేసే సోదరీ సోదరులకు బ్యాంకు ఖాతాలు లేని రోజుల ను గుర్తు తెచ్చుకునేందుకు ఓసారి ప్రయత్నించండి. అయితే, జన్ ధన్ యోజన లో భాగం గా 7 లక్షల మంది తేయాకు తోటల కార్మికుల కు బ్యాంకు ఖాతాలు సొంతమయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తం గా చూస్తే జన్ ధన్ యోజన లో భాగం గా దాదాపు 1.5 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవబడ్డాయి. పని సంస్కృతి తో పాటు మీ మద్దతు, ఆశీర్వాదాలతో ఈ పథకాలన్నీ విజయవంతం అయ్యే దిశ గా ముందుకు సాగుతున్నాయి.
మిత్రులారా,
సమాజం లో పేదలు, అణగారిన, వెనుకబడిన వర్గాల ప్రజల కు అత్యంత హానికరమైంది అవినీతి. మధ్యతరగతి కి అత్యంత భారం గా పరిణమించిందీ అవినీతే. దేశ ప్రగతి పయనాన్ని అడ్డుకునేది ఏదైనా ఉందంటే అది అవినీతే. పేదల హక్కుల ను లాగేసుకుని, కష్టనష్టాల కు గురిచేసేది అవినీతే. అందుకే గడచిన నాలుగున్నర సంవత్సరాల గా పేదల కు హక్కులు దక్కే విధంగా ప్రయత్నించడమే కాక అవినీతి ని, నల్లధనాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం పోరాడుతోంది.
సోదరులు మరియు సోదరీమణులారా,
ప్రధానమంత్రి ఆవాస్ యోజన లో భాగం గా మా ప్రభుత్వం ఒకవైపు 1.25 కోట్ల కు పైగా పేదలకు ఇళ్ల ను నిర్మించింది. మరోవైపు బేనామీ ఆస్తుల చట్టం కింద అవినీతిపరుల నుండి 5,000 కోట్ల రూపాయల విలువైన భవంతులు, కార్ల వంటి వాటి ని జప్తు చేసింది. అలాగే ఇటు యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వారి కంపెనీల ను ఒక్క రోజు లో నమోదు చేసుకునే వీలు కల్పించి.. అటు అవినీతి కి ఆలవాలమైన 3.25 లక్షల బూటకపు కంపెనీల రిజిస్ట్రేశన్ ను రద్దు చేసింది. ఒక చెంప ముద్ర యోజన లో భాగం గా మహిళలకు, యువత కు బ్యాంకు హామీల తో నిమిత్తం లేకుండా రూ.7 లక్షల కోట్ల మేర రుణాలివ్వగా… మరో చెంప మునుపటి ప్రభుత్వాల నిర్వాకం వల్ల చిక్కుల్లో పడిన లక్షలాది కోట్ల బ్యాంకుల సొమ్ములో 3 లక్షల కోట్ల రూపాయలను వెనుకకు తీసుకువచ్చింది. ఒకవైపు ఆయుష్మాన్ భారత్ యోజన లో భాగం గా 5 లక్షల రూపాయల వరకు పేదలకు ఉచిత చికిత్స ను అందిస్తూ- మరోవైపు వైద్య రంగం లో అవినీతి నిర్మూలన కు పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది.
మిత్రులారా,
హెలికాప్టర్ ల కుంభకోణం లో ప్రధాన నిందితుడు భారతదేశపు జైల్లో ఉంటాడని నాలుగేళ్ల కిందట ఎవరూ ఊహించి కూడా ఉండరు. కానీ, మా ప్రభుత్వం ఎంతో ధైర్యం గా అతడి ని భారతదేశాని కి తీసుకువచ్చి రిమాండు కు పంపింది. ఇదీ మా ప్రభుత్వ పనితీరు… ఇదీ మా పని సంస్కృతి.
సోదరులు మరియు సోదరీమణులారా,
వ్యవస్థలో పారదర్శకత్వం ఉన్నపుడు అవినీతి అంతం అవుతుంది. ప్రజల కు అన్ని సదుపాయాలూ అందుబాటు లోకి వచ్చి వారి జీవితాలు సుఖమయం అవుతాయి. తద్వారా ప్రతి రంగంలో ఆ ప్రభావం కనిపిస్తుంది. ఆ ప్రభావాన్ని క్రీడల లో కూడా మనం చూడవచ్చు. నేడు అసమ్ లో సాధారణ కుటుంబాల నుండి, దేశం లోని చిన్న పట్టణాలు, మారుమూల గ్రామాల నుండి దూసుకువచ్చిన యువతరం మన దేశం గర్వపడేలా ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తోంది. అసమ్ ప్రముఖ క్రీడాకారిణి హిమ దాస్, ఇతర యువ మిత్రులంతా ఎగసిపడే ఆత్మవిశ్వాస పూరితమైనటువంటి న్యూ ఇండియా కు ప్రతీక లుగా ఉన్నారు.
మిత్రులారా,
వ్యవస్థ పరివర్తన తో ప్రవర్తన ను మార్చడంతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా దేశ ప్రజల కు సాధికారితను కల్పించేందుకు మేం కృషి చేస్తున్నాం. నేడు దేశ భవిష్యత్ అవసరాల కు అనుగుణం గా రహదారులు, పాఠశాల లు, నగరాలు, గ్రామాలు, నీటిపారుదల, విద్యుత్తు తదితర రంగాలన్నింటా పనులు వేగం గా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తి అయ్యాక ప్రపంచ పటం లో భారతదేశ చిత్రం బ్రహ్మాండం గా ఆవిష్కృతం అవుతుంది.
మిత్రులారా,
అటల్ గారు 21వ శతాబ్దారంభంలో పటిష్ఠం చేసిన పునాదులపై ఒక అద్భుతమైనటువంటి న్యూ ఇండియా ను రూపుదిద్దడానికి మేం శ్రమిస్తున్నాం. సోదరులు మరియు సోదరీమణులారా, ఈ దేశ ప్రజలు, అసమ్ వాసులు మాకిచ్చిన అవకాశం మేరకు వారి ఆకాంక్షల కు అనుగుణం గా విజయాలను సాధించేందుకు మా ప్రభుత్వం దృఢ సంకల్పం తో, చిత్తశుద్ధి తో కృషి చేస్తుంది. మేం బంధుత్వాల కోసం కాకుండా దేశం కోసం, సమాజం కోసం శ్రమిస్తున్నాం. మీ ఆశీస్సుల తో, మీతో కలసి (అయీ అఖోమి), భరత మాత ను ఉన్నత శిఖరాలు అధిరోహింజేయగలమని నా దృఢ విశ్వాసం. ఈ అద్భుత బోగీబీల్ వంతెన సౌకర్యాన్ని పొందినందుకు మిమ్మల్ని నేను మరో సారి అభినందిస్తున్నాను. ఇంత పెద్ద సంఖ్యలో మీరంతా ఇక్కడకు విచ్చేసి మీ ఆశీస్సులను నాపై వర్షించినందుకు నేను మీకు ప్రణామాన్ని ఆచరిస్తున్నాను.
ఎన్నెన్నో ధన్యవాదాలు.
మీరు మీ యొక్క రెండు చేతులను పైకి ఎత్తిపట్టుకొని మీ బలం అంతటితోనూ బిగ్గరగా అనండి –
భారత్ మాతా కీ జయ్
భారత్ మాతా కీ జయ్
భారత్ మాతా కీ జయ్
భారత్ మాతా కీ జయ్
భారత్ మాతా కీ జయ్
అనేకానేక ధన్యవాదాలు.
The inauguration of the #BogibeelBridge is a historic feat and I am glad to be here in Assam, among you all on this special day: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 25, 2018
The people of Assam have made a strong contribution towards the development of our nation.
— PMO India (@PMOIndia) December 25, 2018
Several stalwarts from Assam were involved in the freedom struggle as well: PM @narendramodi
I am in Assam on the day we mark the Jayanti of our beloved Atal Ji.
— PMO India (@PMOIndia) December 25, 2018
Atal Ji gave great importance to good governance.
Good governance is all about strong and inclusive growth: PM @narendramodi
The #BogibeelBridge is a lifeline for the people of Assam. It has enhanced connectivity between Assam and other parts of the nation: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 25, 2018
ये पुल सिर्फ एक पुल नहीं है बल्कि ये इस क्षेत्र के लाखो लोगों के जीवन को जोड़ने वाली लाइफलाइन है। इससे असम और अरुणाचल के बीच की दूरी सिमट गई है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 25, 2018
I congratulate the entire team that worked hard to compete the #BogibeelBridge: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 25, 2018
About 16 years ago, Atal Ji came here. He had a vision for the development of the #BogibeelBridge. This Bridge is also a tribute to that vision of Atal Ji.
— PMO India (@PMOIndia) December 25, 2018
When Shri Vajpayee's Government lost power in 2004, several key infrastructure projects of his era were not completed: PM
Things have changed after May 2014 when topmost priority is being accorded to key projects: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 25, 2018
Delayed infra projects were adversely impacting India's development trajectory. When we assumed office, we added speed to these projects and worked towards their quick completion: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 25, 2018
उज्जवला योजना के तहत करीब 24 लाख मुफ्त गैस के कनेक्शन असम गरीब बहनों को दिए जा चुके हैं। जिसका परिणाम है कि असम में साढ़े 4 वर्ष पहले तक जहां करीब 40 प्रतिशत घरों में गैस सिलेंडर था, वहीं आज ये दायरा दोगुना, करीब 80 प्रतिशत हो चुका है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 25, 2018
सौभाग्य योजना के तहत बीते एक वर्ष में ही असम के 12 लाख से अधिक परिवारों को मुफ्त बिजली कनेक्शन दिया गया है। जिससे असम में बिजलीकरण का दायरा करीब 50 प्रतिशत से बढ़कर करीब 90 प्रतिशत हो चुका है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 25, 2018
आप उस स्थिति को भी याद करिए जब यहां टी गार्डन में काम करने वाले बहन-भाईयों के बैंक खाते ही नहीं थे। जनधन योजना के तहत 7 लाख कामगार बहन-भाईयों के बैंक अकाउंट खुलवाए गए हैं। अगर मैं पूरे असम बात करूं, तो राज्य में करीब डेढ़ करोड़ जनधन खाते हमारी सरकार ने ही खुलवाए हैं: PM
— PMO India (@PMOIndia) December 25, 2018
गरीब का, शोषित का, वंचित का अगर सबसे ज्यादा कोई नुकसान करता है, तो वो है भ्रष्टाचार। भ्रष्टाचार, गरीब से उसका अधिकार छीनता है, उसका जीवन मुश्किल बनाता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 25, 2018
इसलिए पिछले चार साढ़े चार साल से हमारी सरकार जहां एक तरफ गरीब को अधिकार दिला रही है वहीं कालेधन और भ्रष्टाचार के खिलाफ पूरी ताकत से लड़ाई लड़ रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 25, 2018
एक तरफ हमारी सरकार प्रधानमंत्री आवास योजना के तहत सवा करोड़ से ज्यादा गरीबों को घर दे चुकी है, वहीं बेनामी संपत्ति कानून के तहत भ्रष्टाचारियों के 5 हजार करोड़ रुपए के बंगले और गाड़ियों को जब्त किया जा चुका है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 25, 2018
एक तरफ हमारी सरकार ने नौजवानों को सिर्फ एक दिन में नई कंपनी के रजिस्ट्रेशन की सुविधा दी है, तो दूसरी तरफ भ्रष्टाचार की बहुत बड़ी जड़ मानी जाने वाली सवा तीन लाख से ज्यादा संदिग्ध कंपनियों का रजिस्ट्रेशन रद्द भी किया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 25, 2018
एक तरफ हमारी सरकार ने महिलाओं को, नौजवानों को स्वरोजगार के लिए मुद्रा योजना के तहत बिना बैंक गारंटी 7 लाख करोड़ रुपए का कर्ज दिया है, तो वहीं दूसरी तरफ पहले की सरकार ने बैंकों के जो लाखों करोड़ फंसाए थे, उसमें से तीन लाख करोड़ रुपए हमारी सरकार वापस भी ला चुकी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 25, 2018
एक तरफ हमारी सरकार, आयुष्मान भारत योजना के तहत गरीबों को 5 लाख रुपए तक के मुफ्त इलाज की सुविधा दे रही है, तो वहीं दूसरी तरफ मेडिकल सेक्टर में भ्रष्टाचार खत्म करने के लिए भी सख्त कदम उठा रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 25, 2018
चार साल पहले कोई नहीं सोच सकता था, कि हेलीकॉप्टर घोटाले का सबसे बड़ा राजदार भारत आ पाएगा। लेकिन इस राजदार को भारत लाने का काम भी हमारी ही सरकार ने किया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 25, 2018
The Bogibeel Bridge is among the most state-of-the-art infra projects in India.
— Narendra Modi (@narendramodi) December 25, 2018
It will deepen connectivity and open new avenues of prosperity for citizens. pic.twitter.com/RmawojHV02
It is indeed an honour to have inaugurated the Bogibeel Bridge on Atal Ji's Jayanti.
— Narendra Modi (@narendramodi) December 25, 2018
After all, he was really keen that this project see the light of day.
This and several other critical infra projects that were delayed for years are getting completed under the NDA Government. pic.twitter.com/BHaWjOndSO
From bigger roads, rail connectivity to better healthcare facilities, the Northeast is witnessing a great transformation during the last four years. pic.twitter.com/uC3aXE0NL0
— Narendra Modi (@narendramodi) December 25, 2018
A developed Eastern India is essential for a developed India.
— Narendra Modi (@narendramodi) December 25, 2018
The NDA Government’s efforts will usher in record transformation for Eastern India. pic.twitter.com/I0q9E4lW5U
At the core of good governance is compassion, and taking steps that bring a positive difference in the lives of the poor. pic.twitter.com/UDC9oMRPWo
— Narendra Modi (@narendramodi) December 25, 2018
Misgovernance and corruption most adversely impact the poor.
— Narendra Modi (@narendramodi) December 25, 2018
On various parameters, compare the working of the NDA with the previous Government.
Ours is a Government that has diligently worked to fulfil the dreams of the poor. pic.twitter.com/qABlMYsTFI
Have a look at these pictures of the Bogibeel Bridge. pic.twitter.com/V3XcfE2uxS
— Narendra Modi (@narendramodi) December 25, 2018