ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు 2019వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో పర్యటించనున్నారు.
పిఎం-కిసాన్ పథకాన్ని ప్రధాన మంత్రి గోరఖ్ పుర్ లో ప్రారంభిస్తారు.
గోరఖ్ పుర్ లో ఫర్టిలైజర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా మైదానం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, పిఎం-కిసాన్ పథకం ప్రారంభ సూచకం గా ప్రధాన మంత్రి ఒక మీట ను నొక్కుతారు; దీనితో ఎంపిక చేసిన రైతుల ఖాతాల లోకి 2,000 రూపాయల తొలి వాయిదా సొమ్ము ఎలక్ట్రానిక్ పద్ధతి లో బదిలీ అవుతుంది. ఇది పిఎం-కిసాన్ పథకం ఆధికారిక ప్రారంభానికి నాంది పలుకుతుంది.
పిఎం-కిసాన్ పథకం లో భాగం గా ఎంపికయిన రైతుల కు ధ్రువ పత్రాలను కూడా ప్రధాన మంత్రి ప్రదానం చేస్తారు.
పిఎం-కిసాన్ పథకం తాలూకు ఎంపికయిన లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ మాథ్యమం ద్వారా ముచ్చటిస్తారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పి ఎం కిసాన్)
2019 వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ న 2019-20 తాత్కాలిక బడ్జెటు లో భాగం గా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పి ఎం కిసాన్) పథకాన్ని ప్రకటించారు.
ఈ పథకం లో, రెండు హెక్టార్ల వరకు భూమి ని కలిగివున్న చిన్న, సన్నకారు రైతు కుటుంబాల కు ఒక్కొక్క ఏడాది కి 6,000 రూపాయలు అందజేస్తారు.
ఈ మొత్తాన్ని ఒక్కొక్కటీ 2,000 రూపాయల వంతున మూడు వాయిదాల లో అందజేయడం జరుగుతుంది.
ఈ మొత్తాన్ని ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతా కు నేరు గా బదిలీ చేస్తారు. డిబిటి వల్ల మొత్తం ప్రక్రియ పారదర్శకం గా ఉండడం తో పాటు రైతుల కు సమయం ఆదా అవుతుంది.
ఈ పథకాన్ని చిన్న, సన్నకారు రైతు (ఎస్ఎంఎఫ్) ల ఆదాయాన్ని పెంపొందించడం కోసం ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా 12 కోట్ల మందికి పైగా చిన్న, సన్నకారు రైతుల కు ప్రయోజనం చేకూరుతుందని అంచనా.
పంట ఆరోగ్యంగా ఎదిగి, తగిన దిగుబడి ని ఇచ్చి, ప్రతి పంట కాలం ముగిసే సమయాని కి ఆశించిన మేర పంట ఆదాయం పొందడానికి వీలు గా ఎస్ఎంఎఫ్ ల ఆర్ధిక అవసరాల ను తీర్చే అదనపు వనరు గా ఉపయోగపడాలన్నదే పిఎం-కిసాన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది.
ఇటువంటి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారస్తుల సంకెళ్ళ లో చిక్కుకుని పోకుండా ఈ పథకం రక్షణ ను కల్పిస్తుంది. అదేవిధం గా, పొలం పనులను ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగించుకోడానికి ఈ పథకం సహాయపడుతుంది.
కేంద్ర ప్రభుత్వ పథకమైన పి ఎం కిసాన్ స్కీము కు భారత ప్రభుత్వం వంద శాతం నిధులను అందజేస్తుంది. అర్హులైన లబ్ధిదారుల కు ప్రయోజనాన్ని జమ చేయడానికి 2018 డిసెంబర్ 1వ తేదీ నుండి ఈ స్కీము అమలు లోకి వస్తుంది.
ఈ పథకం విధి విధానాల కు అనుగుణం గా సహాయాన్ని అందించేందుకు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగాలు రైతు కుటుంబాల ను గుర్తిస్తాయి.
పి ఎం కిసాన్ అనేది ఒక విప్లవాత్మకమైన పథకం. ప్రతి ఏటా మూడు వాయిదాలు గా ఒక నిర్ణీత హామీ మేరకు ఆర్ధిక సహాయాన్ని అందజేయడం ద్వారా, భారతదేశం లోని చిన్న, సన్నకారు రైతుల జీవితాల్లో పరివర్తన ను తీసుకురావాలన్నదే దీని ఉద్దేశ్యం. డిబిటి ద్వారా అమలు చేసే ఈ పథకం లబ్ధిదారుల బ్యాంకు ఖాతా లోకి నేరుగా మొత్తాన్ని జమ చేస్తుంది. తద్వారా మధ్యవర్తుల ను, అవినీతి ని అరికట్టడం వీలుపడుతుంది. ఒక సారి రుణ మాఫీ తో పోలిస్తే సన్నకారు రైతులు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి పి ఎం కిసాన్ అనేది నిజం గా ఒక సాధికారిత ను కల్పించేటటువంటి ప్రాజెక్టు. దీర్ఘ కాలం లో ఈ పథకం రైతుల వలసల ను అరికట్టడంతో పాటు పంట దిగుబడుల ను పెంపొందింయగలదని ఆశిస్తున్నారు.
ఈ సందర్భం గా గోరఖ్ పుర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల కు ప్రధాన మంత్రి శంకుస్థాపనలు/ ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. అనంతరం ఆయన జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ప్రధానమంత్రి గోరఖ్ పుర్ లో ప్రారంభించే ఈ అభివృద్ధి పథకాల లో గ్యాస్ మౌలిక సదుపాయాల నుండి ఆరోగ్య రంగానికి సంబంధించిన పథకాల వరకు ఉన్నాయి. ఈ ప్రోజెక్టు లు ఉత్తర్ ప్రదేశ్ ప్రజల కు గొప్ప ప్రయోజనాల ను అందించగలవని భావిస్తున్నారు.
**
PM @narendramodi will launch the Pradhan Mantri Kisan Nidhi (PM-KISAN) at Gorakhpur tomorrow. https://t.co/CgYA0F3bUM
— PMO India (@PMOIndia) February 23, 2019
Under PM-KISAN, Rs. 6,000 will be given per year to small and marginal farmer families who have a combined land holding or ownership of upto 2 hectares.
— PMO India (@PMOIndia) February 23, 2019
PM Modi will also lay the foundation stone and dedicate to the nation various development projects in Gorakhpur. These will benefit the people of Uttar Pradesh greatly.
— PMO India (@PMOIndia) February 23, 2019