Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు ఉన్నత స్థాయి కేంద్ర బృందాన్ని పంపించిన ప్ర‌ధాన మంత్రి


స‌హాయ‌, ప‌రిహార చ‌ర్య‌ల‌పై నివేదిక ఇవ్వ‌నున్న బృందం

అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ జిల్లాలో ఇటీవ‌ల కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు హుటాహుటిన చేరుకొని అక్క‌డ జ‌రిగిన న‌ష్టం గురించి అక్క‌డిక్క‌డే అంచ‌నా వేయ‌వ‌ల‌సింద‌ని ఇద్ద‌రు స‌భ్యుల‌తో కూడిన ఒక ఉన్నత స్థాయి కేంద్ర బృందాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆదేశించారు. ఈ బృందంలో నీతి ఆయోగ్ సీనియ‌ర్ అడ్వ‌యిజ‌ర్ ఒక‌రు, ఇంకా హోం అఫైర్స్ మినిస్ట్రీ నుంచి ఒక సంయుక్త కార్య‌ద‌ర్శి.. వీరు ఇరువురు స‌భ్యులుగా ఉంటారు. ఏ విధ‌మైన స‌హాయం అందించాలో, ఏ విధమైన ప‌రిహార చ‌ర్య‌లు చేప‌ట్టాలో అంచ‌నా వేయాల‌ని, రాష్ట్ర అధికారులతో పాటు జిల్లా ల అధికారుల‌తో కూడా చ‌ర్చ‌లు జ‌రిపి ఒక నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని ఈ బృందాన్ని ప్ర‌ధాన మంత్రి ఆదేశించారు.

2016 ఏప్రిల్ 22న ఈ విప‌త్తు సంభ‌వించింది. త‌వాంగ్ లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన విపత్తులో ప్రాణాలను కోల్పోయిన వారికి త‌లా రూ.2 ల‌క్ష‌ల‌ను వారి స‌మీప బంధువుల‌కు ఎక్స్-గ్రేషియా స‌హాయంగా ఇవ్వ‌డానికి, అలాగే ఈ విప‌త్తులో తీవ్రంగా గాయ‌ప‌డిన వారికి త‌లా రూ.50,000 స‌హాయంగా అంద‌జేయ‌డానికి ప్ర‌ధాన మంత్రి ఇప్ప‌టికే అనుమ‌తిని మంజూరు చేశారు.