Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐ ఆర్ ఎన్ ఎస్ ఎస్-1 జి ప్రయోగాన్ని తిలకించిన ప్రధాన మంత్రి; సౌత్ బ్లాక్ నుంచి వీడియో కాన్ఫ రెన్సింగ్ ద్వారా ఐఎస్ ఆర్ ఒ శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలియజేశారు

ఐ ఆర్ ఎన్ ఎస్ ఎస్-1 జి ప్రయోగాన్ని తిలకించిన ప్రధాన మంత్రి; సౌత్ బ్లాక్ నుంచి వీడియో కాన్ఫ రెన్సింగ్ ద్వారా ఐఎస్ ఆర్ ఒ శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలియజేశారు


మార్గనిర్దేశక ఉపగ్రహమైన ‘ఐ ఆర్ ఎన్ ఎస్ ఎస్-1 జి’ ప్రయోగాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లోని సౌత్ బ్లాక్ నుంచి వీక్షించారు. ఉపగ్రహాన్ని మోసుకు వెళ్లిన ఈ పి ఎస్ ఎల్ వి, మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు శ్రీహరికోట నుంచి నింగిలోకి ఎగసింది.

ఉపగ్రహాన్ని ప్రయోగించడం విజయవంతం అయిన కొద్ది సేపటికే, ప్రధాన మంత్రి శ్రీహరికోటలోని ఐఎస్ ఆర్ ఒ శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫ రెన్సింగ్ మాధ్యమం ద్వారా మాట్లాడి వారిని అభినందించారు.

ప్రజల జీవనాలను మార్చివేసే శక్తి కలిగిన అంతరిక్ష శాస్త్రంలో భారతీయ శాస్త్రవేత్తలు అనేక విజయాలను సాధించారు అంటూ ఆయన ఈ సందర్భంగా వారిని కొనియాడారు.

“తాజా సఫల ప్రయోగంతో, మనం స్వీయ సాంకేతిక విజ్ఞానం అండ‌తో మన మార్గాలను నిర్ణయించుకోగల శక్తి సంపాదించుకొన్నాం. ఇది ప్రజలకు శాస్త్రజ్ఞుల‌ు అందించిన ఒక గొప్ప బహుమతి” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలు ఒక్క భారతదేశానికి మాత్రమే ఉపయోగపడేవి కాదని, ఎస్ ఎ ఎ ఆర్ సి లోని సాటి సభ్యత్వ దేశాలకు కూడా ఇవి తోడ్పడగలుగుతాయని ఆయన అన్నారు.

ఈ మార్గదర్శక వ్యవస్థను ఎన్ ఎ వి ఐ సి – “నావిగేషన్ విత్ ఇండియన్ కాన్ స్టిలేషన్” గా వ్యవహరించనున్నట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు. ఇది “మేక్ ఇన్ ఇండియా ” కు, ఇంకా “మేడ్ ఫర్ ఇండియన్స్”కు ఒక ఉదాహరణగా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు.