Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇతర దేశాలతో కలసి నావికుల సామర్ధ్య ధ్రువపత్రాల ఏకపక్ష/ద్వైపాక్షిక గుర్తింపు కోసం ఆదర్శ ఎంఒయు పై సంతకాలకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి


నావికుల గుర్తింపునకు సంబంధించి ఇంటర్ నేశనల్ కన్ వెన్శన్ ఆన్ స్టాండర్ట్ స్ ఆఫ్ ట్రయినింగ్, సర్టిఫికేశన్ ఎండ్ వాచ్ కీపింగ్ (ఎస్ టిసిడబ్ల్యు) ఫర్ సీ ఫేరర్స్, 1978 లోని 1/10 నిబంధన మరియు తదుపరి సవరణ లను అనుసరించి ధ్రువ పత్రాల ఏకపక్ష/ ద్వైపాక్షిక గుర్తింపు కోసం ఆదర్శ అవగాహనపూర్వక ఒప్పంద పత్రాని కి (ఎంఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పంద పత్రాల పై నౌకాయాన మంత్రిత్వ శాఖ యొక్క ఇంచార్జి మంత్రి మరియు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి యొక్క అనుమతి తో భారత ప్రభుత్వ నౌకాయాన డైరెక్టర్ జనరల్ విదేశాల లో ఆయన కు సరిజోడైన అధికారులతో కలసి సంతకాలు చేయనున్నారు.

లాభాలు:

భారత నావికులు భారత ప్రభుత్వ నౌకాయన డైరెక్టర్ జనరల్ జారీ చేసిన గుర్తింపు ధృవీకరణ పత్రాల తో ఏదైనా దేశానికి వెళ్ళినప్పుడు తమ దేశం జారీచేసిన ధ్రువపత్రాల ను అదే విధం గా గుర్తించాలని కోరకుండా మన నావికుల ను గుర్తించే వెసులుబాటు ను ఏకపక్ష అవగాహన ఒప్పందం కల్పిస్తుంది.

దానివల్ల భారతీయ నావికులు ఆయా దేశం పతాకం పరిధి లోని నౌకల లో నియామకానికి అర్హులు అవుతారు. ఆ విధం గా భారత నావికుల కు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అన్య దేశం తో ప్రతిపాదిత ద్వైపాక్షిక ఒప్పందం వల్ల భారతదేశం మరియు అటువంటి ఎంఒయు ను కుదుర్చుకునే మరొక దేశం ఎస్ టిసిడబ్ల్యూ ఒడంబడిక లోని 1/10 నిబంధన ప్రకారం తమ తమ దేశాల పౌరులకు జారీచేసిన సముద్ర విద్య మరియు శిక్షణ, సామర్ధ్య ధృవీకరణ పత్రాలు, ప్రమాణీకరణ, శిక్షణకు సంబంధించిన లిఖితసాక్ష్యం, ఆరోగ్య యోగ్యత పత్రాలను పరస్పరం గుర్తించుకుంటాయి.

ఈ కారణం తో రెండు దేశాల కు చెందిన నావికుల లో ఏ ఒక్క దేశపు నౌకలలో అయినా వారి ధ్రువపత్రాలకు దక్కిన మాన్యత ఆధారం గా ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. భారతదేశం సుశిక్షితులు అయిన నావికుల సమూహం పెద్ద సంఖ్య లో ఉన్న దేశం కావడం వల్ల ఈ ఒప్పందం తో భారత్ లబ్ధి ని పొందగలుగుతుంది.

**********