Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఆనందంగా ఉండడం.. ఈ రెండూ ముఖ్యమేనని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి


మానవులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఆనందంగా ఉండడం.. ఈ రెంటినీ సమతుల్యం చేసుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని చెబుతున్న ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
‘‘శరీరం సత్త్వసంజ్ఞం చ వ్యాధీనామశ్రయో మతః
తథా సుఖానాం యోగస్తు సుఖానాం కారణం సమః’’ అన్నదే ఆ సూక్తి.
పైన ప్రస్తావించిన శ్లోకం మానవులు శారీరక స్వస్థతను కాపాడుకుంటూ ఉండటానికి, సంతోషంగా ఉండటానికి సమాన ప్రాధాన్యాన్ని ఇవ్వాలని చెబుతోంది. సుఖంగా ఉండటం అంటే వ్యాధుల బారిన పడకుండా ఉండటమొక్కటే కాదు, ఆరోగ్యవంతమైన, సంపూర్ణమైన జీవితానికి  తోడ్పడే కారకాల మధ్య సామంజస్యపూర్వకమైన పొందికను సాధించడం కూడా అని ఈ శ్లోకం వివరిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘శరీరం సత్త్వసంజ్ఞం చ వ్యాధీనామశ్రయో మతః
తథా సుఖానాం యోగస్తు సుఖానాం కారణం సమః’’ అని పేర్కొన్నారు.