పిఎంఇండియా
కేంద్ర ప్రభుత్వం కొత్త గా రూపొందించి అమలు చేయనున్న సూక్ష్మ ఫూడ్ ప్రాసెసింగ్ సంస్థ ల క్రమబద్ధీకరణ స్కీము (ఎఫ్ ఎంఇ) ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ స్కీము ను 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి తో దేశవ్యాప్తం గా అమలు చేస్తారు. దీనికి అయ్యే ఖర్చు ను భారత ప్రభుత్వం మరియు రాష్ట్రాలు 60:40 నిష్పత్తి లో భరిస్తాయి.
స్కీము వివరాలు:
ఉద్దేశాలు:
సూక్ష్మ ఫూడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కు ఆర్ధిక సౌలభ్యం కల్పించడం
లక్షిత సంస్థ ల రెవెన్యూల ను పెంచడం
ఆహార నాణ్యత మరియు భద్రత ప్రమాణాల ను అధికం గా అమలు చేయడం
మద్దతు వ్యవస్థ ల సామర్థ్యాన్ని పటిష్టం చేయడం
వ్యవస్థీకృతం కాని రంగం నుండి క్రమబద్ధమైన రంగం గా పరివర్తన
మహిళా నవపారిశ్రామికులు మరియు అభిలాషపూరిత జిల్లాల పై ప్రత్యేక దృష్టి
చెత్త నుండి సంపద ను సృష్టించే కార్యకలాపాల కు ప్రోత్సాహం
గిరిజన జిల్లాల లో చిన్న అటవీ ఉత్పత్తుల పై దృష్టి
ప్రధాన లక్షణాలు:
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం ఖర్చు ను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు 60:40 నిష్పత్తి లో భరిస్తాయి
దాదాపు 2,00,000 సూక్ష్మ సంస్థల కు సబ్సిడీ ఋణం తో సహాయం
ఈ స్కీము అయిదేళ్ల పాటు 2020-21 నుండి 2024-25 వరకు అమలవుతుంది
సముదాయ పద్ధతి
త్వరగా పాడయిపోయే వస్తువుల పై శ్రద్ధ
స్వకీయ సూక్ష్మ యూనిట్ల కు మద్దతు:
సూక్ష్మ సంస్థల కు ఇచ్చే రుణం లో 35 శాతం సబ్సిడీ ప్రాజెక్టు వ్యయం ఋణం గరిష్ట పరిమితి రూ. 10 లక్షల రూపాయలు.
లబ్ధిదారు తన వంతు గా కనీసం 10 శాతం చెల్లించాలి; మిగిలిన మొత్తం ఋణం నుండి ఉంటుంది.
సంస్థ వద్దే నైపుణ్య శిక్షణ మరియు ప్రాజెక్టు నివేదిక తయారీ లో మరియు సాంకేతిక స్థాయి పెంపు లో తోడ్పాటు
రైతు ఉత్పత్తి సంస్థలు / స్వయం సహాయక బృందాలు / సహకార సంఘాలకు తోడ్పాటు:
స్వయం సహాయక బృందాల కు అవసరమైన నిర్వహణ పెట్టుబడి మరియు చిన్న పనిముట్లు కొనేందుకు అవసరమైన రుణాలకు సీడ్ క్యాపిటల్.
ముందు /వెనుకల సంధానానికి, ఉమ్మడి మౌలిక సదుపాయాల కల్పన కు, ప్యాకేజింగు కు, మార్కెటింగు కు మరియు బ్రాండింగ్ కోసం గ్రాంటు.
నైపుణ్య శిక్షణ మరియు నిర్వహణ లో తోడ్పాటు.
పరపతి తో సంధానించిన పెట్టుబడి సబ్సిడీ.
అమలు కాలపట్టిక:
ఈ స్కీము ను దేశవ్యాప్తం గా ఒకేసారి అమలుచేయడం జరుగుతుంది.
2,00,000 యూనిట్ల కు పరపతి తో సంధానించిన సబ్సిడీ ని అందించడం జరుగుతుంది.
స్వయం సహాయక బృందాల కు (ప్రతి స్వయం సహాయక బృందం సభ్యుల కు నిర్వహణ పెట్టుబడి మరియు చిన్న పనిముట్లు
కొనేందుకు ఋణం కోసం రూ. 4 లక్షల చొప్పున) సీడ్ క్యాపిటల్.
రైతు ఉత్పత్తి సంస్థల కు ముందు /వెనుకల సంధానాని కి, ఉమ్మడి మౌలిక సదుపాయాల కల్పన, ప్యాకేజింగ్, మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ ల కోసం గ్రాంటు ను ఇవ్వడం.
పరిపాలన మరియు అమలు యంత్రాంగాలు:
కేంద్రం లో ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మంత్రి అధ్యక్షత న ఏర్పాటయ్యే అంతర్ మంత్రివర్గ సాధికారత కమిటీ ఈ స్కీము ను పర్యవేక్షిస్తుంది.
చీఫ్ సెక్రెటరి అధ్యక్షత న ఏర్పాటయ్యే కమిటీ రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత స్థాయిల లో ఈ స్కీము ను పర్యవేక్షించి రైతు ఉత్పత్తి సంస్థ లు / స్వయం సహాయక బృందాలు/ సహకార సంఘాల కు కొత్త ప్రతిపాదనల ను మంజూరు చేయడం / సిఫారసు చేయడం వంటివి చూస్తుంది.
స్కీము అమలు కు సంబంధించిన వివిధ కార్యకలాపాల తో కూడిన కార్యాచరణ ప్రణాళిక ను రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాలు రూపొందించి కేంద్ర ప్రభుత్వ ఆమోదాని కి పంపుతాయి.
తృతీయ పక్షం మూల్యాంకనం మరియు మధ్యంతర సమీక్ష లు ఈ కార్యక్రమం లో అంతర్భాగం గా ఉంటాయి.
రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతం లో నోడల్ శాఖ మరియు సంస్థ
రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం ఈ స్కీము అమలు చేసే నోడల్ శాఖ మరియు సంస్థ ను ప్రకటిస్తుంది.
రాష్ట్రం లో / కేంద్రపాలిత ప్రాంతం లో ఏర్పాటయ్యే నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఎ) ఈ స్కీము ను ఆయా రాష్ట్రం లో / కేంద్రపాలిత ప్రాంతం లో అమలు చేయడానికి బాధ్యత ను తీసుకొంటుంది.
అలాగే రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం స్థాయి లో దీనికి సంబంధించిన ప్రణాళిక ను తయారు చేయడం, సమూహ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, జిల్లా /ప్రాంత స్థాయి లో మార్గదర్శక బృందాల ఏర్పాటు, పనితీరు ను పర్యవేక్షించడం, యూనిట్ల కు, బృందాల కు తోడ్పాటు మొదలైన బాధ్యత లు కూడా ఎస్ఎన్ ఎ వే.
జాతీయ పోర్టల్ మరియు ఎమ్ఐఎస్
ఈ స్కీము నుండి లబ్ది ని పొందదలచిన దరఖాస్తుదారులు/ స్వకీయ సంస్థ లు జాతీయ స్థాయి లో ఏర్పాటయ్యే పోర్టల్ లో దరఖాస్తు చేయాలి.
స్కీము కు సంబంధించిన అన్ని కార్యకలాపాల ను గురించి జాతీయ పోర్టల్ లో చేపట్టడం జరుగుతుంది.
కేంద్రీకరణ చట్రం
ఈ స్కీము లో భాగం గా భారత ప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలు ప్రస్తుతం అమలు చేస్తున్న స్కీముల నుండి మద్దతు లభిస్తుంది.
ముఖ్యం గా పెట్టుబడి మదుపు, నిర్వహణపరమైన తోడ్పాటు, శిక్షణ మరియు ఉమ్మడి మౌలిక సదుపాయాల కల్పన కు ఇతర వనరుల నుండి మద్దతు లభించనప్పుడు ఆ అంతరాల ను భర్తీ చేసే ప్రయత్నాన్ని ఈ పథకం చేస్తుంది.
ప్రభావం మరియు ఉపాధి కల్పన :
దీనివల్ల దాదాపు ఎనిమిది లక్షల సూక్ష్మ సంస్థలకు సమాచార లభ్యత, మంచి అవగాహన మరియు క్రమబద్ధీకరణ ల వంటి ప్రయోజనాలు ప్రాప్తిస్తాయి.
2,00,000 మైక్రో ఎంటర్ ప్రైజెస్ కు విస్తరణ మరియు స్థాయి పెంపుదల కోసం రుణ ఆధార సబ్సిడీ, నిర్వహణ లో తోడ్పాటు ను ఇవ్వడం జరుగుతుంది
దానివల్ల అవి క్రమబద్ధమై, వృద్ధి చెంది పోటీ పడే స్థితి కి చేరగలుగుతాయి.
ఈ ప్రాజెక్టు వల్ల 9 లక్షల మంది నైపుణ్యం గల పనివారు మరియు పాక్షిక నిపుణత గల శ్రామికులు తయారవుతారు.
ప్రస్తుతం పనిచేస్తున్న సూక్ష్మ ఫూడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కు, మహిళా నవ పారిశ్రామికులు మరియు ప్రబల కాంక్ష ఉన్న జిల్లాల లోని నవ పారిశ్రామికులకు రుణ లభ్యత ను పెంచడం ఈ స్కీము యొక్క ఉద్దేశ్యం గా ఉంది.
వ్యవస్థీకృత విపణుల తో మెరుగైన విలీనీకరణ.
వేరుచేయడం, గ్రేడ్ లను ఇవ్వడం, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, నిలవ ల వంటి సాధారణ సేవల లభ్యత అధికం అవుతుంది.
పూర్వ రంగం:
దాదాపు 25 లక్షల నమోదు కాని ఫూడ్ ప్రాసెసింగ్ సంస్థ లు ఉన్నాయి. మొత్తం ఈ రంగం లో ఉన్న వాటి లో ఇవి 98 శాతాని కి సమానం. ఇవన్నీ వ్యవస్థీకృతం కాని రంగం లో ఉన్నాయి. వాటిలో 66 శాతం గ్రామీణ ప్రాంతాల లో మరియు 80 శాతం కుటుంబాల నిర్వహణ లో ఉన్నాయి.
ఈ రంగం అనేక సవాళ్ళ ను ఎదుర్కొంటోంది. ఈ రంగాన్ని బలోపేతం చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరగలదు.
Important decision of the Cabinet that will contribute to a vibrant food processing sector. It will also strengthen the efforts towards Atmanirbhar Bharat. https://t.co/HwPnPqYtiK
— Narendra Modi (@narendramodi) May 20, 2020