ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2020 డిసెంబర్, 10వ తేదీన న్యూఢిల్లీ లోని సంసద్ మార్గ్ వద్ద, నూతన పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ‘ఆత్మనీర్భర్ భారత్’ దృష్టిలో అంతర్భాగంగా ఈ నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటిసారి ప్రజల పార్లమెంటును నిర్మించడానికి ఇది చారిత్రాత్మక అవకాశం కానుంది. ఇది 2022 లో స్వాతంత్య్ర దినోత్సవ 75 వ వార్షికోత్సవంలో ‘నూతన భారతదేశం’ యొక్క అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ఇది నిర్మాణం కానుంది.
నూతన పార్లమెంటు భవనం ఆధునిక, అత్యాధునిక మరియు ఇంధన సామర్థ్యంతో ఉంటుంది. ప్రస్తుత పార్లమెంటుకు ఆనుకొని త్రిభుజాకార ఆకారంలో నిర్మించనున్న భవనంలో అత్యంత అప్రమత్తమైన భద్రతా సౌకర్యాలు ఉంటాయి. లోక్సభ ప్రస్తుత పరిమాణంలో 3 రెట్లు, రాజ్యసభ గణనీయంగా పెద్దదిగా ఉంటుంది. నూతన భవనం యొక్క లోపలి భాగంలో భారతీయ సంస్కృతి, మన ప్రాంతీయ కళలు, చేతి కళలు, వస్త్రాలు, వాస్తుశిల్పం వంటి విభిన్న కళల సమాహారం మనకు దర్శనమిస్తుంది. డిజైన్ ప్రణాళికలో అద్భుతమైన కేంద్ర రాజ్యాంగ ప్రదర్శన శాల కోసం విశాలమైన ప్రదేశం ఉంటుంది, ఇది ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంటుంది.
నూతన పార్లమెంట్ భవనం నిర్మాణం వనరుల సమర్థవంతమైన హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటుంది, పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహిస్తుంది. ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు, ఆర్థిక పునరుజ్జీవనానికి దోహదం చేస్తుంది. నూతన భవనం – అధిక నాణ్యత గల ధ్వని, దృశ్య శ్రవణ సౌకర్యాలు, మెరుగైన, సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లు, సమర్థవంతమైన, అత్యవసర తరలింపు నిబంధనలను కలిగి ఉంటుంది. ఈ భవనం – భూకంప సంబంధమైన జోన్-5 అవసరాలకు అనుగుణంగా ఉండటంతో పాటు, అత్యధిక నిర్మాణ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కూడా ఉంటుంది, నిర్వహణ మరియు కార్యకలాపాల సౌలభ్యం కోసం రూపొందించబడింది.
ఈ కార్యక్రమంలో – గౌరవనీయులు లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా; పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ వెంకటేష్ జోషి; గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్), శ్రీ హర్దీప్ ఎస్. పురీ; రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, శ్రీ హరివంశ్ నారాయణ్ సింగ్ పాల్గొంటారు. కేంద్ర కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, కార్యదర్శులు, రాయబారులు / హై కమీషనర్లతో సహా దాదాపు రెండు వందల మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని వెబ్-సైట్ ద్వారా ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నారు.
****