Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జార్ఖండ్‌లోని ఖూంటీలో దుర్ఘటన.. ప్రాణనష్టం.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి


జార్ఖండ్‌లోని ఖూంటీలో జరిగిన ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసిందని తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర  ఆవేదన వ్యక్తం చేశారు.

ఆప్తులను కోల్పోయిన వారికి ఆయన సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కావాలని దైవాన్ని శ్రీ మోదీ ప్రార్ధించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ, ఇలా పేర్కొంది:
‘‘జార్ఖండ్‌లోని ఖూంటీలో జరిగిన ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసిందని తెలిసి ఎంతో బాధ కలిగింది. ఆప్తులను కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.’’

 

***