Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జనాభా లెక్కల సమాచార పత్రాన్ని స్వయంగా పూర్తి చేసిన ప్రధానమంత్రి

జనాభా లెక్కల సమాచార పత్రాన్ని స్వయంగా పూర్తి చేసిన ప్రధానమంత్రి


గృహాల జాబితాగృహ గణనతో కూడిన జనగణన 2027′ మొదటి దశ ప్రారంభానికి సూచికగా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సమాచార పత్రాన్ని పూర్తి చేశారుతొలిసారిగా డిజిటల్ పద్ధతిలో డేటా సేకరణ జరుగుతున్న జనగణన ఇదేనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారుఅంతేకాకుండా ప్రజలు కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేలా ఉన్న ఈ విధానం భారతీయులకు సాధికారతను కల్పిస్తుందని ఆయన తెలిపారు.

దేశ ప్రజలంతా కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని.. తద్వారా జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:

గృహాల జాబితాగృహ గణనకు సంబంధించిన జనగణన 2027′ మొదటి దశ ఈ రోజు ప్రారంభమవుతోందితొలిసారిగా డిజిటల్ మాధ్యమాల ద్వారా డేటా సేకరణ జరుగుతున్న జనగణన ఇదేఇది భారతీయులు కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేలా వారికి సాధికారతను కల్పిస్తుంది.

కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకొని ఈ జనగణన ప్రక్రియలో పాల్గొనాలని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.”

 

***