పిఎంఇండియా
అంతరిక్ష రంగానికి సంబంధించిన గ్లోబల్ స్పేస్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్ కంపెనీ ‘దిగంతర’ వ్యవస్థాపకులు అనిరుధ్ శర్మ, తన్వీర్ అహ్మద్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
భారత్ వేగంగా స్వయంసమృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఈ వ్యాసం పేర్కొంది. గతంలో ఇతర దేశాలపై ఆధారపడిన అనేక రంగాల్లో ఇప్పుడు భారత్ స్వయంగా సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటోందని వివరించింది. అంతరిక్ష రంగంలో భారత్ తన సామర్థ్యాలను మరింత పెంచుకుంటోందని, కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తోందని వ్యాసంలో పేర్కొన్నారు. ప్రపంచంలో భారత్ తన స్థానాన్ని, గుర్తింపును మరింత బలోపేతం చేసుకుంటోందని వివరించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
‘‘భారత్ వేగంగా స్వావలంబన వైపు అడుగులు వేస్తోంది. ఒకప్పుడు ఏ వస్తువుల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వచ్చేదో, ఈనాడు అలాంటి అనేక ఉత్పత్తులను దేశంలోనే సొంతంగా తయారుచేసుకుంటున్నాం. గ్లోబల్ స్పేస్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్ కంపెనీ దిగంతర వ్యవస్థాపకులు అనిరుధ్ శర్మ, తన్వీర్ అహ్మద్‌లు రాసిన ఈ వ్యాసంలో.. అంతరిక్ష రంగంలో భారత్ తన సామర్థ్యాలను ఎలా పెంచుకుంటోంది, నూతన సాంకేతికతను ఏ విధంగా అభివృద్ధి చేస్తోంది, ప్రపంచస్థాయిలో తనకంటూ ఒక బలమైన గుర్తింపును ఎలా సొంతం చేసుకుంటోందో స్పష్టంగా వివరించారు’’.
भारत तेजी से आत्मनिर्भरता की ओर बढ़ रहा है। आज देश ऐसी कई चीजें खुद बना रहा है, जिनके लिए कभी दूसरे देशों पर निर्भर रहना पड़ता था। वैश्विक अंतरिक्ष खुफिया और रक्षा कंपनी @Digantarahq के संस्थापक अनिरुद्ध शर्मा और तनवीर अहमद ने अपने इस आलेख में बताया है कि कैसे भारत अंतरिक्ष के क्षेत्र में अपनी क्षमता बढ़ा रहा है, नई तकनीक विकसित कर रहा है और दुनिया में अपनी मजबूत पहचान बना रहा है।
— PMO India (@PMOIndia) October 8, 2026