పిఎంఇండియా
అంతరిక్ష రంగం లో ప్రైవేటు రంగ భాగస్వామ్యాని కి ఊతాన్ని ఇవ్వడం ధ్యేయం గా ఉన్నటువంటి దూరగామి సంస్కరణల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం భారతదేశం లో పరివర్తన ను ఆవిష్కరించి, దేశాన్ని స్వయంసమృద్ధియుతమైంది గాను, ఇంకా సాంకేతిక విజ్ఞానం పరం గా ఆధునికమైంది గాను మలచాలన్న ప్రధాన మంత్రి యొక్క దీర్ఘకాలిక దార్శనికత కు అనుగుణం గా ఉంది.
రోదసి రంగం లో అధునాతన శక్తి సామర్థ్యాల ను కలిగివున్నటువంటి కొద్దిపాటి దేశాల సరసన భారతదేశం ఈసరికే స్థానాన్ని సంపాదించుకొంది. ఈ సంస్కరణల తో ఈ రంగం నూతన శక్తి ని మరియు గతిశీలత ను సంతరించుకొని, అంతరిక్ష సంబంధి కార్యకలాపాల తదుపరి దశల లోకి దేశం ముందంజ వేసేందుకు సహాయకారి కాగలదు.
ఈ రంగం లో శీఘ్ర వృద్ధి కి దోహదపడటమొక్కటే కాకుండా ప్రపంచ రోదసి సంబంధి ఆర్థిక వ్యవస్థ లో భారతదేశ పరిశ్రమ రంగం ఒక ప్రధాన పాత్రధారి అయ్యేందుకు కూడా ఇది తోడ్పడనుంది. దీనితో, సాంకేతిక విజ్ఞాన రంగం లో పెద్ద ఎత్తు న ఉపాధికల్పన కు అవకాశం లభించడం తో పాటు భారతదేశం ఒక గ్లోబల్ టెక్నాలజీ పవర్ హౌస్ గా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది.
ప్రధాన ప్రయోజనాలు:
సాంకేతిక విజ్జానం పరం గా ముందడుగు వేయడం లో మరియు మన పారిశ్రామిక పునాది ని విస్తరరించుకోవడం లో అంతరిక్ష రంగం ఒక ప్రముఖమైనటువంటి ఉత్ప్రేరకం వలె పనిచేయగలుగుతుంది. ప్రతిపాదిత సంస్కరణలు రోదసి సంబంధి ఆస్తుల ను, రోదసి సంబంధి సమాచార నిధి ని, ఇంకా రోదసి సంబంధి సదుపాయాల ను మెరుగైన రీతి లో అందుబాటులోకి తీసుకు రావడం తో పాటు రోదసి సంబంధి ఆస్తులు మరియు కార్యకలాపాల యొక్క సాంఘిక, ఆర్థిక వినియోగాన్ని సైతం పెంపొందింపచేయగలవు.
నూతనం గా ఏర్పాటు చేసినటువంటి ఇండియన్ స్పేస్ ప్రమోశన్ ఎండ్ ఆథరైజేశన్ సెంటర్ (IN-SPACe) భారతీయ ఆకాశ మౌలికసదుపాయాల వినియోగం లో ప్రైవేటు కంపెనీల కు సమాన అవకాశాలు లభ్యమయ్యేటట్టు చూస్తుంది. అది నియంత్రణ పరం గా స్నేహపూర్వకమైనటువంటి వ్యవస్థ ను, ఇంకా విధానాల ను ప్రోత్సహించడం ద్వారా అంతరిక్ష కార్యకలాపాల లో ప్రైవేటు పరిశ్రమల కు చేదోడునిచ్చి, వాటిని పెంపు చేసి మరి మార్గదర్శనం చేయగలదు.
ప్రభుత్వ రంగ వాణిజ్య సంస్థ ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) రోదసి కార్యకలాపాల ను ‘సరఫరా లు ప్రధాన చోదక శక్తి గా ఉన్న’ అటువంటి నమూనా స్థాయి నుండి ‘అవసరాలు ప్రధాన చోదక శక్తి గా ఉండే’ అటువంటి నమూనా స్థాయి కి కొత్త రూపమిచ్చేందుకు ప్రయత్నించగలదు; తద్ద్వారా అంతరిక్షం లోని మన ఆస్తుల ను సర్వోత్తమ రీతి లో వినియోగించుకొనేందుకు పూచీపడగలదు.
పరిశోధన మరియు అభివృద్ధి కార్యకలాపాల పైన, నూతన సాంకేతిక పరిజ్ఞానం పైన, అన్వేషక బృందాల పైన మరియు మానవసహిత అంతరిక్ష యాత్ర కార్యక్రమం పైన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ ఆర్ ఒ) మరింత శ్రద్ధ ను వహించేందుకు ఈ సంస్కరణ లు మార్గాన్ని సుగమం చేస్తాయి. ‘అవకాశ ప్రకటన’ యంత్రాంగం ద్వారా గ్రహ అన్వేషక సాహసయాత్రల లో కొన్నింటిని ప్రైవేటు రంగం కూడా పాలుపంచుకోవడానికి అనుమతించడం జరుగుతుంది.
**
The reform trajectory continues.
— Narendra Modi (@narendramodi) June 24, 2020
The Union Cabinet’s approval to reforms in the space sector is yet another step towards making our nation self-reliant and technologically advanced. The reforms will boost private sector participation as well. https://t.co/oqYZFt3Pr4