పిఎంఇండియా
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత నారీ శక్తి ధైర్య సాహసాలు, పట్టుదల, వారు సాధించిన విజయాలను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.
దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి.. భారత ప్రగతిని తీర్చిదిద్దడంలో పెరుగుతున్న నారీ శక్తి పాత్రను ప్రస్తావించారు. ప్రతి రంగంలోనూ మహిళలు పట్టుదల, సృజనాత్మకత, సాటిలేని ఉత్సాహంతో తమ సహకారాన్ని అందిస్తున్నారన్న ఆయన.. వారి విజయాలు దేశానికి స్ఫూర్తినివ్వడమే కాకుండా ‘వికసిత్ భారత్‘ నిర్మాణానికి కావాల్సిన ఉమ్మడి సంకల్పాన్ని బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు.
మహిళ నేతృత్వంలో జరిగే అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతతో ఉన్నట్లు తెలిపిన ప్రధానమంత్రి.. అనేక ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు మహిళా సాధికారతే మూలాధారమని పేర్కొన్నారు. ప్రతి మహిళ తన పూర్తి సామర్థ్యాన్ని చాటుకునేలా, భారత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామ్యం వహించేలా అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
భారత నారీ శక్తి సాధించిన విజయాలు దేశానికే గర్వకారణమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దేశ నిర్మాణంలో మహిళలు పోషిస్తున్న పరివర్తనాత్మక పాత్రకు ఇవి ఒక శక్తిమంతమైన నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ మరింత పురోగమిస్తున్న కొద్దీ ఒక బలమైన, సుసంపన్నమైన దేశం వైపు సాగే మన ఉమ్మడి ప్రయాణానికి మహిళల ఆశయాలు, సహకారం నిరంతరం మార్గదర్శకత్వం వహిస్తాయని ఆయన అన్నారు.
గడచిన దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ స్థాయి మహిళల జీవితాలు రూపాంతరం చెందిన తీరును ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. మహిళా సాధికారత కోసం చేపట్టిన వివిధ కార్యక్రమాలు వారి జీవితాలపై చూపిన సానుకూల ప్రభావాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:
“అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన నారీ శక్తి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ప్రతి రంగంలోనూ మహిళలు పట్టుదల, సృజనాత్మకత, సాటిలేని ఉత్సాహంతో భారత ప్రగతిని తీర్చిదిద్దుతున్నారు. వారి విజయాలు మన దేశానికి స్ఫూర్తినివ్వడమే కాకుండా ‘వికసిత్ భారత్‘ నిర్మాణానికి కావాల్సిన మన ఉమ్మడి సంకల్పాన్ని బలోపేతం చేస్తున్నాయి.
మా వివిధ పథకాలు, కార్యక్రమాలకు మహిళా సాధికారత మూలాధారం. ప్రతి మహిళ తన పూర్తి సామర్థ్యాన్ని చాటుకునేలా, భారత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామ్యం వహించేలా అవకాశాలను కల్పించడానికి మేం కట్టుబడి ఉన్నాం.”
“భారత నారీ శక్తి సాధించిన విజయాలు గర్వకారణం. దేశ నిర్మాణంలో వారు పోషిస్తున్న పరివర్తనాత్మక పాత్రకు ఇవి ఒక శక్తిమంతమైన నిదర్శనం. భారత్ మరింత పురోగమిస్తున్న కొద్దీ ఒక బలమైన, సుసంపన్నమైన దేశం వైపు సాగే మన ఉమ్మడి ప్రయాణానికి మహిళల ఆశయాలు, సహకారం నిరంతరం మార్గదర్శకత్వం వహిస్తాయి.”
“గత దశాబ్ద కాలంలో క్షేత్రస్థాయిలో మహిళల జీవితాలు రూపాంతరం చెందుతున్న తీరుకు సంబంధించిన విశేషాలు…”
On International Women’s Day, I extend my greetings to all our Nari Shakti.
— Narendra Modi (@narendramodi) March 8, 2026
Across every field, women are shaping India’s progress with determination, creativity and unmatched zeal. Their achievements inspire our nation and strengthen our collective resolve to build a Viksit… https://t.co/iFLHVrtHnk
The achievements of India’s Nari Shakti are a source of pride and a powerful reminder of the transformative role in nation building. As India progresses further, the aspirations and contributions of women will continue to guide our collective journey towards a strong and… https://t.co/81oxSfAKMo
— Narendra Modi (@narendramodi) March 8, 2026
A glimpse of how the lives of women have been transformed at the grassroots over the past decade…#NayeBharatKiNariShakti https://t.co/XMLN2ZxwgL
— Narendra Modi (@narendramodi) March 8, 2026