పిఎంఇండియా
లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను స్మరించుకున్నారు. ఆ మహనీయుని ప్రభావం అన్ని తరాల ప్రజలపై చెరగని ముద్ర వేసిందన్నారు. ప్రజా జీవితం దేశ పునర్నిర్మాణానికి గొప్ప సాధనంగా మారుతుందంటూ ఆయన ప్రజల్లో సరికొత్త స్ఫూర్తిని నింపారని శ్రీ మోదీ కొనియాడారు.
అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలంలో లోక్‌నాయక్ జేపీ నిర్భయంగా తన గళాన్ని వినిపించారని శ్రీ మోదీ పేర్కొన్నారు. సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావాన్ని… సమాజంలో వెనకబడిన, నిరుపేద వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషినీ ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మనం ‘వికసిత భారత్‘ నిర్మాణానికి కృషి చేస్తున్న ఈ తరుణంలో… జేపీ ఆశయాలు, ఆదర్శాలను నిజం చేయడానికి దేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని శ్రీ మోదీ పేర్కొన్నారు
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందాం. ఆయన ప్రభావం తరాలకు అతీతంగా నిలిచింది. ప్రజా జీవితం దేశ పునర్నిర్మాణానికి గొప్ప సాధనంగా మారుతుందని ఆయన ప్రజల్లో నమ్మకాన్ని, స్ఫూర్తిని నింపారు. ముఖ్యంగా, అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలంలో ఆయన నిర్భయంగా తన గళం వినిపించడం ఎన్నటికీ మరవలేనిది.
సుపరిపాలనను అందించడం, సమాజంలో వెనకబడిన వర్గాల ప్రజల సంక్షేమం పట్ల లోక్‌నాయక్ జేపీ గారికి ఎంతో తపన ఉండేది. మనం ‘వికసిత్ భారత్‘ నిర్మాణానికి కృషి చేస్తున్న వేళ, ఆయన ఆశయాలను నిజం చేయడానికి దేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది.”
Remembering Loknayak Jayaprakash Narayan on his birth anniversary. His appeal transcended generations. He inspired people to believe that public life could be an instrument of national renewal. His fearless voice during the Emergency was also noteworthy. Loknayak JP also was passionate about ensuring good governance and reaching those who are at the margins of society. We remain committed to fulfilling his ideals as we work to build a Viksit Bharat.
— Narendra Modi (@narendramodi) October 11, 2026