Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహారాజా అగ్రసేన్‌ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి


మహారాజా అగ్రసేన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. మహారాజా అగ్రసేన్ జీవితం, ఆదర్శాలు మానవతా మార్గంలో పయనించాలని మనకు తెలియజేస్తున్నాయని.. ఆయన మహోన్నత భావాలు భారత సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

“ప్రజాసేవ, సామాజిక సద్భావనకు ప్రతీక అయిన మహారాజా అగ్రసేన్ గారికి ఆయన జయంతి సందర్భంగా కోటి నివాళులు. ఆయన జీవితం, ఆదర్శాలు మనకు నిరంతరం మానవతా మార్గంలో నడవాలని ప్రేరేపిస్తున్నాయి. భారతదేశ సాంస్కృతిక అభ్యున్నతికి ఆయన మహోన్నత ఆలోచనలు ఎప్పటికీ స్ఫూర్తి కేంద్రాలుగా నిలుస్తాయి.”