Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అఫ్గానిస్తాన్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అఫ్గానిస్తాన్ లోని మజార్-ఎ-శరీఫ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు.

“మజార్-ఎ-శరీఫ్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి పిరికితనంతో కూడిన చర్య. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇదే మా సంతాపం. మృతుల ఆత్మలకు శాంతిని ప్రసాదించవలసిందంటూ ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నామ”ని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.