Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం 150వ వార్షికోత్సవాల ముగింపు వేడుకలో ప్రధాన మంత్రి ప్రసంగం

అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం 150వ వార్షికోత్సవాల ముగింపు వేడుకలో ప్రధాన మంత్రి ప్రసంగం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం 150వ వార్షికోత్సవాల ముగింపు వేడుకను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలహాబాద్ న్యాయస్థానం మన న్యాయ వ్యవస్థకు ఒక పుణ్య క్షేత్రం వంటిదని అన్నారు. న్యాయ వృత్తితో సంబంధం ఉన్నవారు కూడా మన స్వాతంత్ర్య పోరాటంలో ఒక కీలక పాత్రను పోషించారని, వలస వాదం బారి నుంచి ప్రజలను సంరక్షించారని ఆయన చెప్పారు.

2022 సంవత్సరంలో మనం 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవాలను జరుపుకొనే నాటికి మనం ఎటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించుకోవాలో ఆలోచన చేయవలసిందిగా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ దిశగా ప్రతి పౌరుడు ఒక మార్గ సూచీని సిద్ధం చేయాలని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం 2014 మే నుండి సుమారు 1200 చట్టాలను రద్దు చేసినట్లు ప్రధాన మంత్రి చెప్పారు. ఈ శతాబ్దంలో సాంకేతిక విజ్ఞానం ఒక కీలకమైన పాత్ర పోషిస్తోందని, న్యాయ వ్యవస్థలో కూడా సాంకేతిక విజ్ఞానానికి ఎంతో అవకాశం ఉందని ఆయన అన్నారు. స్టార్ట్ అప్ రంగంలో పని చేస్తున్నవారు సాంకేతిక విజ్ఞానం, న్యాయ వ్యవస్థకు ఏ విధంగా తోడ్పడగలుగుతుంది అన్న అంశాలపై నూతన ఆవిష్కరణలకు నడుం కట్టాలని ఆయన కోరారు.

***