పిఎంఇండియా
అస్సాంలోని సిల్చార్‌లో జరిగిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ.. సంస్కృతి, చైతన్యానికి నిలయమైన బరాక్ లోయను సందర్శించడం తనకు ఎప్పుడూ ప్రత్యేక అనుభూతినిస్తుందని తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘ఈరోజు భూమిపూజ చేసిన షిల్లాంగ్-సిల్చార్ హై స్పీడ్ కారిడార్.. సిల్చార్‌ను మిజోరాం, మణిపూర్, త్రిపురతో అనుసంధానిస్తుంది. దీనివల్ల అస్సాంతో పాటు మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లోని మన రైతు సోదరసోదరీలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది’’.
‘‘గడిచిన దశాబ్ద కాలంలో మా ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా అస్సాంలో తదుపరి తరం సాంకేతకతకు సంబంధించిన వ్యవస్థ, ప్రతిభావంతులైన యువత సిద్ధమవుతున్నారు. దీనితో పాటు వైద్య విద్యలో బలమైన వ్యవస్థ వల్ల ఇక్కడి యువతకు అపార అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి’’.
‘‘సిల్చార్‌కు భారీ సంఖ్యలో తరలి వచ్చిన అస్సాం కుటుంబ సభ్యుల ఉత్సాహం చూస్తుంటే.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై వారికున్న అచంచలమైన విశ్వాసం స్పష్టమవుతోంది’’.
***
आज जिस शिलांग-सिलचर हाई-स्पीड कॉरिडोर का भूमि पूजन हुआ है, वह सिलचर को मिजोरम, मणिपुर और त्रिपुरा से कनेक्ट करेगा। इसका फायदा असम सहित पूरे नॉर्थ ईस्ट के हमारे किसान भाई-बहनों को भी होगा। pic.twitter.com/w11Kv0ojBY
— Narendra Modi (@narendramodi) March 14, 2026
बीते एक दशक में हमारी सरकार के प्रयासों से असम में नेक्स्ट जेनरेशन टेक्नोलॉजी से जुड़ा इकोसिस्टम और टैलेंट तैयार हो रहा है। इसके साथ ही मेडिकल एजुकेशन का सशक्त नेटवर्क बनने से यहां के युवाओं के सामने अवसरों का नया आसमान खुला है। pic.twitter.com/PZpcWE3BiQ
— Narendra Modi (@narendramodi) March 14, 2026
सिलचर में अपार संख्या में आए असम के अपने परिवारजनों का उत्साह बताता है कि डबल इंजन सरकार के विकास कार्यों में उनका अटूट विश्वास है। pic.twitter.com/xYo1NC15l5
— Narendra Modi (@narendramodi) March 14, 2026