Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అస్సాం లో మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం

అస్సాం లో మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు అస్సాం లో మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన భారీ జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

అస్సాం ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. శ్రీ సర్బానంద సోనోవాల్ రూపంలో వారికి ఆదివాసీ సమాజానికి చెందిన ముఖ్యమంత్రి లభించారని, సమాజానికి సేవ చేయడానికి శ్రీ సోనోవాల్ అంకితం అయ్యారని ప్రధాన మంత్రి అన్నారు.

కొత్త సర్కారు అస్సాం ప్రజలకు సేవలు అందించగలదన్న, అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని పరివర్తన వైపునకు నడిపించగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

సహకారాత్మక సమాఖ్య తత్వం సిద్ధాంతం స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని, రాష్ట్రాలు పురోగమించేందుకు వీలుగా వాటికి గరిష్ఠ శక్తిని అందజేయాలని కోరుకొంటోందని ప్రధాన మంత్రి చెప్పారు. ప్రజాస్వామ్యం ప్రాతినిధ్యం కోసమే ఏర్పడింది, కేంద్రం మరియు రాష్ట్రాలు అభివృద్ధి కోసం భుజం భుజం కలిపి నడవాల్సిందే అని ఆయన అన్నారు. దేశాన్ని ప్రత్యేకించి దేశంలోని ఈశాన్య ప్రాంతాన్ని సమగ్రంగాను, అన్ని రంగాలలోను అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టంచేశారు.