Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అస్సాం లో వ‌ర‌ద ప‌రిస్థితి పై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రితో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి


అస్సాం లో వ‌ర‌ద ప‌రిస్థితి పై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ సర్వానంద సొనోవాల్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నిన్న, ఈ రోజు మాట్లాడారు.

రాష్ట్రం లోని కొన్ని ప్రాంతాల‌లో త‌లెత్తిన వ‌ర‌ద ప‌రిస్థితిని కేంద్ర ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు క్షుణ్ణంగా ప‌ర్య‌వేక్షిస్తోంద‌ని, ఈ వరద పరిస్థితిని అధిగ‌మించ‌డం కోసం అస్సాముకు అన్ని విధాలుగాను స‌హాయం అందించ‌డం జ‌రుగుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు.

“అస్సాంలో వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ది మొద‌లు కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిస్థితిని నిరంత‌రం క్షుణ్ణంగా ప‌ర్య‌వేక్షిస్తోంది.

రాష్ట్రం లోని కొన్ని ప్రాంతాల‌లో త‌లెత్తిన వ‌ర‌ద ప‌రిస్థితిని అధిగ‌మించ‌డం కోసం అస్సాముకు సాధ్య‌మైన‌ అన్ని విధాలుగానూ సాయ‌ం చేస్తాం” అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.