పిఎంఇండియా
సాయిరాం నామ స్మరణ నడుమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తికి చేరుకున్నారు. స్థానికులు అత్యంత ఆత్మీయంగా ప్రధానమంత్రికి స్వాతం పలికారు.
ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాలులో శ్రీ సత్య సాయిబాబాకు ప్రధానమంత్రి నివాళులు అర్పించారు. ఆ తరువాత ఓంకార్ హాలుకు వెళ్లి, దర్శించుకున్నారు. ఈ పవిత్ర స్థలాల్ని దర్శించుకోవడంతో శ్రీ సత్య సాయిబాబా అపార కరుణ, మానవాళి అభ్యుదయం కోసం ఆయన జీవన పర్యంతం కనబరచిన నిబద్ధత తనకు గుర్తుకు వచ్చాయని ప్రధానమంత్రి అన్నారు. నిస్వార్థంగా సేవ చేస్తూ ఉండాలని శ్రీ సత్య సాయిబాబా ఇచ్చిన సందేశం లక్షల మందికి మార్గదర్శకంగా నిలుస్తూ, స్ఫూర్తిని అందిస్తోందని శ్రీ మోదీ అన్నారు.
శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు ఏర్పాటు చేసిన గోదాన్ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాలుపంచుకున్నారు. ఈ ట్రస్టు పశు సంరక్షణ రంగంలో విశిష్ట కృషి చేయడం సహా అనేక ఉదాత్త కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి తన శుభాశీస్సులను అందించారు. శ్రీ సత్య సాయిబాబా చూపిన మార్గంలో అంతా నడుస్తూ, సమాజ హితం కోసం పనిచేయాలని ప్రధానమంత్రి అన్నారు.
‘ఎక్స్’లో వివిధ సందేశాల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘సాయిరాం నామ స్మరణ నడుమ ఎంతో ఆప్యాయతతో స్వాగతం పలుకుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తికి చేరుకున్నా.’’
‘‘ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాలులో శ్రీ సత్య సాయిబాబాకు నివాళులు అర్పించాను. ఓంకార్ హాలుకు వెళ్లి, దర్శనం చేసుకున్నాను. ఈ పవిత్ర స్థలాల్ని దర్శించడం ఆయన అపార కరుణనూ, మానవాళి అభ్యుదయానికి ఆయన జీవన పర్యంతం చూపిన నిబద్ధత గుర్తుకు వస్తాయి. నిస్వార్థంగా సేవ చేయాలని ఆయన ఇచ్చిన సందేశం లక్షల మందికి మార్గాన్ని చూపుతోంది, స్ఫూర్తిని అందిస్తోంది.’’
‘‘శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు ఎన్నో ఉదాత్తమైన పనులు చేస్తూ, పశు సంరక్షణ పట్ల ఎనలేని శ్రద్ధ వహిస్తోంది. ఇవాళ, గోదాన్ కార్యక్రమంలో పాల్గొన్నా. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు గోవులను అందజేస్తున్నారు. కింది చిత్రాల్లో కనిపిస్తున్న ఆవులు గిర్ ఆవులు. శ్రీ సత్య సాయిబాబా చూపించిన దారిలో మనమంతా నడుద్దాం.. మన సమాజ సంక్షేమం దిశగా కృషి చేద్దాం.’’
***