Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆత్మగౌరవం, సాహసం, ద‌ృఢత్వాలకు ఉన్న ప్రాధాన్యాన్ని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి


ఆత్మగౌరవం, సాహసం, ద‌ృఢత్వాలకు ఉన్న ప్రాధాన్యాన్ని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఏ పరిస్థితిలోనైనా సరే రాజీపడిపోకుండా మన సిద్ధాంతాలు, విలువల పట్ల స్థిరంగా నిలబడి ఉండడంలోనే  నిజమైన పరాక్రమం, బలం  ఇమిడి ఉంటాయని ఆయన అన్నారు.
‘‘ఉద్యచ్ఛేదేవ న నమేదుద్యమో హ్యేవ పౌరుషమ్
అప్యపర్వణి భజ్యేత న నమత్వేవ కస్యచిత్’’ అనే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి పంచుకున్నారు.
మనిషి ఎల్లవేళలా ఆత్మగౌరవంతో, సాహసంతో, శాంతియుత ఆచరణతో జీవించాలనే సందేశాన్ని ఈ సుభాషితం మనకు అందిస్తోంది. ఒక వ్యక్తి తన సిద్ధాంతాలతో, విలువలతో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా సత్యం, ధైర్యం, ఆత్మగౌరవంతో తన ఆదర్శాల్ని అనుసరించడంలోనే సిసలైన పరాక్రమం, బలం ఇమిడి ఉంటాయి.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ
‘‘ఉద్యచ్ఛేదేవ న నమేదుద్యమో హ్యేవ పౌరుషమ్
అప్యపర్వణి భజ్యేత న నమత్వేవ కస్యచిత్’’ అని పేర్కొన్నారు.