పిఎంఇండియా
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పునర్నిర్మాణ కసరత్తులో భాగంగా ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ (ఎఎఫ్ హెచ్‌క్యు) సివిల్ సర్వీసు లో క్రమ ప్రాతిపదికన 7 ప్రిన్సిపల్ డైరక్టర్ పోస్టులు మరియు 36 డైర్టకర్ పోస్టులను ఏర్పాటు చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఎఎఫ్ హెచ్‌క్యు సివిల్ సర్వీసులో రెగ్యులర్ పోస్టులను ఏర్పాటు చేయడమనేది కేడర్ లో స్తబ్ధతను తొలగిస్తుంది. అంతేకాకుండా ఈ నిర్ణయం సేవల సమర్ధతను మెరుగుపరచడంతో పాటు ఉత్తమ కేడర్ మేనేజ్ మెంట్ పరంగా ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అదనపు భారాన్నేమీ మోపకుండానే కేడర్ మేనేజ్ మెంట్ సంబంధిత దృష్టి కోణంలో నుండి చూసినప్పుడు లాభసాటిగా ఉండడంతో పాటు కేడర్ సేవలను ఉత్తమమైన రీతిలో వినియోగించుకొనే దిశగా ఇది ఒక వినూత్నమైన చర్య కాగలదు.
పదోన్నతుల స్థానంలో ‘‘ఇన్ సిటు’’ ప్రమోషన్ ల స్థానంలో రెగ్యులర్ పోస్టులను ఏర్పాటు చేయడం వల్ల కేడర్ మేనేజ్‌మెంట్ లో మరింత పారదర్శకతకు చోటు ఇచ్చినట్లు అవుతుంది. రెగ్యులర్ పోస్టులకు మరిన్ని బాధ్యతలను అప్పగించడం ద్వారా ఎఎఫ్ హెచ్‌క్యు సిఎస్ అధికారులకు మరింత ఎక్కువ జవాబుదారీతనాన్ని సంతరించడం మరియు మరింత ఎక్కువ ఫలితాలను రాబట్టడం సాధ్యపడుతుంది.
*****