పిఎంఇండియా
కేంద్ర మాజీ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు. సమాజంలోని అణగారిన-బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన అవిరళ కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజలకు, దేశానికి సేవ చేయడంలో ఆయన అంకితభావం సదా స్మరణీయమని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“కేంద్ర మాజీ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా ఈ రోజున ఆయనకు నా హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను. సమాజంలో వెనుకబడి, బలహీన వర్గాల ప్రజానీకం అభ్యున్నతి దిశగా ఆయన కృషి అనిర్వచనీయం. ప్రజలకు, దేశానికి సేవలందించడంలో ఆయన అంకితభావం చిరస్మరణీయం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
पूर्व केंद्रीय मंत्री रामविलास पासवान जी की जयंती पर उन्हें मेरी भावभीनी श्रद्धांजलि। समाज के वंचित और कमजोर वर्गों के उत्थान के लिए उन्होंने अहम योगदान दिया। जनसेवा और राष्ट्रसेवा के प्रति अपने समर्पण भाव के लिए वे हमेशा याद किए जाएंगे। pic.twitter.com/SPkoNgmuMu
— Narendra Modi (@narendramodi) July 5, 2026