Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడలలో పురుషుల 10,000 మీటర్ల పరుగుల పోటీలో రజత పతకం సాధించిన గుల్వీర్ సింగ్‌ను అభినందించిన ప్రధాని


ఐచి-నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడలలో పురుషుల 10,000 మీటర్ల పరుగుల పోటీలో రజత పతకం సాధించిన గుల్వీర్ సింగ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు. ఇదే క్రీడల్లో దీనికంటే ముందు కాంస్య పతకం సాధించి ఇప్పుడు మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచారని ప్రధాని కొనియాడారు.

గుల్వీర్ సింగ్ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రశంసించిన ప్రధాని.. అతని పట్టుదల, పురోగతి భారతదేశంలో లాంగ్ డిస్టెన్స్ యువ రన్నర్లకు ఎంతో స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:

“ఐచి-నగోయాలో మొదట కాంస్య పతకం ఇప్పుడు రజతం. ఆసియా క్రీడల్లో గుల్వీర్ సింగ్ మనల్ని గర్వపడేలా చేస్తున్నాడు!

పురుషుల 10,000 మీటర్ల పరుగుల పోటీలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు అతనికి హృదయపూర్వక అభినందనలు. అతని పట్టుదల, సాధిస్తున్న పురోగతి భారతదేశంలోని లాంగ్ డిస్టెన్స్ యువ రన్నర్లకు స్ఫూర్తిదాయకం: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ”.