పిఎంఇండియా
ఆసియా క్రీడల షాట్ పుట్ విభాగంలో కాంస్యం గెలిచి, అద్భుతమైన ప్రదర్శన చేసిన మన్‌ప్రీత్ కౌర్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
ఆమె షాట్ పుట్‌ను అద్భుతంగా విసిరారని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఆమెకు ఎల్లప్పుడూ విజయం లభించాలని ఆకాంక్షించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శన!
ఆమె అద్భుతమైన త్రో ఆమెకు ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని సంపాదించిపెట్టింది. మన్‌ప్రీత్‌కు అభినందనలు! ఆమె విజయాలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను