పిఎంఇండియా
ఆసియా క్రీడల్లో పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్యం సాధించిన అనంత్‌జీత్ సింగ్ నారుక, భవ్‌తేగ్ సింగ్ గిల్, మైరాజ్ అహ్మద్ ఖాన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలియజేశారు. ఇది గర్వించదగిన విజయమని పేర్కొన్నారు.
వారి ఏకాగ్రత, సమష్టి కృషి ఆదర్శప్రాయమన్నారు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘ఆసియా క్రీడల్లో గర్వించదగిన విజయం!
పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్యం గెలుచుకున్న అనంత్ జీత్ నారుక, భవ్‌తేగ్ సింగ్ గిల్, మైరాజ్ అహ్మద్ ఖాన్‌కు అభినందనలు. వారి ఏకాగ్రత, సమష్టి కృషి ఆదర్శప్రాయమైనవి. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను: పీఎం నరేంద్రమోదీ’’
***
A proud achievement at the Asian Games!
— PMO India (@PMOIndia) September 23, 2026
Congratulations to Anantjeet Singh Naruka, Bhavtegh Singh Gill and Mairaj Ahmad Khan on winning the Bronze Medal in the Men’s Skeet Team event. Their focus and teamwork have been exemplary. Best wishes to them for their future endeavours:… pic.twitter.com/DwZsWZSOP5